
కుమారి ఖాతాలో మరో ప్రాజెక్ట్
కుమారి 21ఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన క్యూట్ హీరోయిన్ హెబ్బా పటేల్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటీవల నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ సినిమాలు నిరాశపరిచినా హెబ్బా జోరు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజా మరో క్రేజీ ప్రాజెక్ట్కు ఓకె చెప్పింది. పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిన విజయ్ దేవరకొండకు జోడిగా నటించనుంది హెబ్బా.
యంగ్ డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాకు అంగీకరించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన హెబ్బా హీరోయిన్గా నటించనుంది. ప్రియాంక లీడ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన మరో హీరోయిన్ పాత్రకు హెబ్బాను ఫైనల్ చేశారట. ప్రస్తుతం ఏంజెల్, అంధగాడు సినిమాల రిలీజ్ల కోసం వెయిట్ చేస్తున్న హెబ్బా తర్వలోనే విజయ్ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టనుంది.