
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ మూవీకి ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వం వహించగా, విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ మీద సత్యనారాయణ పర్చా నిర్మిస్తున్నారు. సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ చిత్రం మేకర్లు థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. 'మనసే మరలా' అంటూ సాగే ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉంది. ఎస్పీ చరణ్, కే ప్రణతిల గానం, పూర్ణాచారి సాహిత్యం, సుభాష్ ఆనంద్ బాణీ చక్కగా కుదిరాయి. ఇక ఈ లిరికల్ వీడియోలో హెబ్బా పటేల్, సుమన్ వూటుకూరిల పాత్రల తీరు ఆకట్టుకుంటుంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలో చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment