'ధూం ధాం'గా హెబ్బా పటేల్ కొత్త సినిమా ట్రైలర్‌ | Hebah Patel Dhoom Dhaam Movie Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

'ధూం ధాం'గా హెబ్బా పటేల్ కొత్త సినిమా ట్రైలర్‌

Nov 2 2024 6:23 PM | Updated on Nov 2 2024 6:37 PM

Hebah Patel Dhoom Dhaam Movie Official Trailer Out Now

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కొత్త సినిమా 'ధూం ధాం'. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ విడుదలైంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. నవంబర్‌ 8న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్ చేశారు.  'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటకు సోషల్‌మీడియాలో మంచి గుర్తింపు దక్కింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement