‘ధూం ధాం’లో ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ: డైరెక్టర్‌ సాయికిషోర్‌ | Director Sai Kishore Macha Talk About Dhoom Dhaam Movie | Sakshi
Sakshi News home page

‘ధూం ధాం’లో ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ: డైరెక్టర్‌ సాయికిషోర్‌

Published Sun, Nov 3 2024 6:19 PM | Last Updated on Sun, Nov 3 2024 6:19 PM

Director Sai Kishore Macha Talk About Dhoom Dhaam Movie

ఈ మధ్య మనం థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్ మూవీస్ చూస్తున్నాం. వాటిలో కామెడీ మిస్ అయ్యాం. ఆ మిస్ అయిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని మా "ధూం ధాం" సినిమాలో చూస్తారు. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. దాంతో పాటు మంచి ప్రేమ కథ ఉంటుంది’ అన్నారు డైరెక్టర్‌ సాయికిషోర్‌ మచ్చా. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ధూం ధాం’. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్‌ సాయికిషోర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

నేను శ్రీను వైట్ల గారి దగ్గర వర్క్ చేశాను. ఉషా కిరణ్ మూవీస్ లో ఓ సినిమాకు ప్లాన్ చేశాం. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం మూవీకి డైరెక్షన్ టీమ్ ను లీడ్ చేశాను. ఆ తర్వాత త్రిష హీరోయిన్ గా నటించిన బృందా సిరీస్ కు వర్క్ చేశాను. ఇలా మూవీస్ కు వర్క్ చేస్తున్న టైమ్ లో రైటర్ గోపీమోహన్ గారు "ధూం ధాం" సినిమా ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అలా ఈ సినిమా మొదలైంది.

మొత్తం షూటింగ్ అమెరికాలో చేయాలని ముందుగా అనుకున్నాం. అయితే అనుమతుల కోసం ఆరు నెలలు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తర్వాత యూరప్ లో షూటింగ్ చేద్దామని పోలెండ్ ను సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ చిత్రీకరణ జరిపాం. పోలెండ్ లో కూడా మాకు ఇండియా ఉన్నట్లు భోజన, ఇతర వసతులు కల్పించారు నిర్మాత రామ్ కుమార్. ఆయన గురించి, ఆయన మంచితనం గురించి, సినిమా మీద ఉన్న ప్యాషన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే.

తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా వల్ల నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్ తో ప్లెజెంట్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారికి మైత్రీ నవీన్ గారు మంచి ఫ్రెండ్. అలా కాంటాక్ట్ అయి సినిమా చూపించాం. వారికి బాగా నచ్చి రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు.

హీరో చేతన్ మంచి టాలెంటెడ్ హీరో. అతనిలో నటుడిగా మంచి టైమింగ్ ఉంది. తండ్రి కోసం కొడుకు పడే ఒక ఆరాటాన్ని తన పాత్రలో చూస్తారు. కామెడీ, ఫైట్స్, రొమాంటిక్, ఎమోషనల్..ఇలా ప్రతి సీన్ లో చేతన్ బాగా నటించాడు. అతనికి ఈ సినిమా మంచి ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. హెబా పటేల్ కూడా తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించింది. సెట్ లో కూడా తను చాలా యాక్టివ్ గా ఉండేది.

"ధూం ధాం" సినిమా మీరు కొనే టికెట్ ధరకు విలువైన ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. రీసెంట్ గా వైజాగ్ లో పెయిడ్ ప్రీమియర్స్ వేశాం. ఆ ప్రీమియర్స్ లో దాదాపు ప్రతి సీన్ కు ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ తో చాలా హ్యాపీగా అనిపించింది. ఈనెల 8వ తేదీన అన్ని థియేటర్స్ నుంచి ఇలాంటి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement