‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైంది ముంబై బ్యూటీ హెబ్బా పటేల్. తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించిన ఆమెకు ఆ తర్వాత వరస ఆఫర్లు వచ్చినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు పొందలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు తక్కువగా ఉండటంతో ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. దీనితో పాటు హెబ్బా సోషల్ మీడియాలో సైతం పుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.
చదవండి: తల్లి కాబోతోన్న నయనతార?, బయటికొచ్చిన అసలు విషయం!
ఇదిలా ఉంటే ఆ మధ్య హెబ్బా బొద్దుగా మారి అందరికి షాకిచ్చింది. ‘అందుకే హెబ్బాకు అవకాశాలు రావడం లేదని, కాస్తా ఫిజిక్‌పై దృష్టి పెట్టు’ అంటూ ఆమె నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సినిమాల్లో కనిపించని హెబ్బా.. రీసెంట్‌గా లైవ్ చిట్‌చాట్‌కు వచ్చింది. ఇందులో ఆమె సన్నగా మారి అందంగా నాజుగ్గా కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్ ఆమె బ్యూటీ సీక్రెట్ గురించి ఆరా తీశారు. దీనికి అదో పెద్ద సీక్రెట్ అంటూ సమాధానం ఇస్తూనే అసలు విషయం చెప్పేసింది ఈ ముంబై భామ.
చదవండి: అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే!
ఇప్పటివరకు ఈ రహస్యం ఎవరికి చెప్పలేదన్న హెబ్బా.. తనకు అందం కొంత దేవుడు ఇస్తే.. మరికొంత డాక్టర్ల చలవ వల్ల వచ్చిందని చెప్పింది. ఇలా తను సర్జరీ చేయించుకున్న విషయాన్ని హెబ్బా చెప్పకనే చెబుతూ తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టేసింది. చూస్తుంటే హెబ్బా బాడీట్రాన్స్‌ఫామింగ్ సర్జరీ చేసుకుని మరింత సెక్సీగా తయారైంది. కాగా చాలా మంది తారలు సర్జీరీ చేసుకున్న విషయాన్ని బయటకు చెప్పేందుకు ఇష్టపడరు. దీంతో హెబ్బా ఇలా తాను సర్జరీ చేసుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఓదెల రైల్వే స్టేషన్, తెలిసివాళ్లు అనే చిత్రాల్లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment