
అలా ఎలా... అంటూ తెలుగుతెరకు పరిచయమై..నేనింకా కుమారి 21ఎఫ్‌నేనని గోలచేసిఎక్కడికి పోతావు చిన్నవాడా..అంటూయువత గుండెల్లో కొలువైనఏంజెల్ హీరోయిన్ హెబ్బాపటేల్‌ఆదివారం అనంతలో సందడి చేశారు.ఎస్‌ఆర్‌ఐటీ వార్షికోత్సవంలో ఆడిపాడిఅందరినీ ఉర్రూతలూగించారు.
అనంతపురం, బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల దశమ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులుగా బెంగళూరుకు చెందిన అసెంచర్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్, ప్రముఖ సినీనటి హెబ్బా పటేల్, నటుడు షఫీ, కళాశాల చైర్‌పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, సీఈఓ జగన్మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ హితేంద్రశర్మ, టీపీఓ రంజిత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన అసెంచర్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డైరెక్టర్ హెచ్‌ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సూచించారు. అలాగే అదే విధంగా ఇంజినీరింగ్ విద్యకు ఎంతో డిమాండ్ ఉందని, ప్రతి విద్యార్థి వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు అవసరమయ్యే సెమినార్ సదస్సులను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం వివిధ బ్రాంచ్‌లలో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, బంగారు పథకాలను ప్రదానం చేశారు.
నా పేరు కుమారి...
నా పేరు కుమారి అంటూ సినీనటి హెబ్బా పటేల్ చెప్పిన డైలాగ్‌తో విద్యార్థులు తెగ సంబరపడి పోయారు. మరోవైపు నటుడు షఫీ కూడా తన మార్క్ డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు. అనంతరం విద్యార్థులు చేసిన డ్యాన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment