శశికుమార్ మియాజార్జ్ జంటగా వెట్రివేల్ | sasikumar miyajarj vetrivel | Sakshi
Sakshi News home page

శశికుమార్ మియాజార్జ్ జంటగా వెట్రివేల్

Published Sun, Jan 17 2016 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

శశికుమార్ మియాజార్జ్ జంటగా వెట్రివేల్

శశికుమార్ మియాజార్జ్ జంటగా వెట్రివేల్

నటుడు శశికుమార్‌తో నటి మియాజార్జ్ జత కడుతున్న వెట్రివేల్ చిత్ర షూటింగ్ మొదలైంది. దర్శకుడు, నిర్మాత, నటుడు శశికుమార్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రెండేళ్లు అయింది. ఆయన కథానాయకుడిగా నటించిన బ్రహ్మన్ చిత్రం తరువాత మరో చిత్రం విడుదల కాలేదు. ప్రస్తు తం జాతీయ ఉత్తమ దర్శకుడు బాలా దర్శకత్వంలో తారాతప్పట్టై చిత్రాన్ని నిర్మిస్తూ క థా నాయకుడిగా నటిస్తున్నారు. గరగాట కళకు కమర్షియల్ టచ్ ఇచ్చి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శశికుమార్ నాద స్వరం కళాకారుడిగా నటించడం విశేషం.
 
 నటి వరలక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాం తర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంగీత జ్ఞాని ఇళయరాజా బాణీ లు అందిస్తున్నారు. ఇది ఆయన సహస్ర చిత్రం కావడం విశేషం. త్వరలో ఆడియోను, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి శశికుమార్ సన్నాహాలు చేస్తున్నారు. మరో పక్క నూతన చిత్రంలో నటిస్తున్నారు. దీనికి వెట్రివేల్ అనే టైటిల్ నిర్ణయించారు. అమరకావ్యం చిత్రం ఫేమ్ మియాజార్జ్ నాయకిగా నటిస్తోంది. సీనియర్ నటుడు ప్రభు, తంబిరామయ్య ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వసంతమణి పరిచయం అవుతున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement