Sancitasetti
-
రమ్‌తో నా కోరిక తీరుతుంది!
మంచి కథా పాత్రలతో ప్రేక్షకుల మదిలో పది కాలాలపాటు గుర్తుండిపోవాలని హీరోహీరోయిన్లు కోరుకుంటుడడం సహజమే. యువ నటి సంచితాశెట్టి అలాంటి కోరికనే వ్యక్తం చేస్తున్నారు. జయంరవి కథానాయకుడిగా నటించిన తిల్లాలంగడి చిత్రంలో నటించి తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంచితాశెట్టి ఆ తరువాత విజయ్సేతుపతికు జంటగా సూదుకవ్వుం చిత్రంతో కథానాయకిగా మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆ బ్యూటీ నటించిన రమ్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆల్ ఇన్ పిక్చర్ పతాకంపై నిర్మాత విజయరాఘవేంద్ర నిర్మించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు సాయిభరత్ పరిచయం అవుతున్నారు. వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో ధనుష్‌కు తమ్ముడిగా నటించి మంచి గుర్తింపు పొందిన హరీష్ ఘోష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్గా మియాజార్జ్ నటించారు. హస్యనటుడు వివేక్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి నటి సంచితాశెట్టి తెలుపుతూ నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలన్న తన కోరిక ఈ రమ్ చిత్రం ద్వారా తీరుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇందులో తాను నటించిన లియా పాత్రకు అంత ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇది హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అరుునా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగించేదిగా ఉంటుందన్నారు. ముఖ్యంగా సీనియర్ నటుడు వివేక్ లాంటి వారితో నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు.ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇక ఈ చిత్ర హీరో హరాశ్ఘోష్ చాలా శ్రమించి ఎంతో అంకిత భావంతో నటించారని కితాబిచ్చారు.తాను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో తొమ్మిది మంది ప్రతిభావంతులైన సహాయ దర్శకులు, లఘు చిత్రాల దర్శకులతో నటించడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ అమ్మడు నటించిన మరో చిత్రం ఎన్కిట్టమోదాదే కూడా వచ్చే నెల విడుదలకు సిద్ధం అవుతోందన్నది గమనార్హం. -
సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్
అనిరుద్‌ను స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజా సూపర్‌స్టార్ సంగీత దర్శకుడిగా పేర్కొన్నారు. ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై టీ.విజయరాఘవేంద్ర నిర్మించిన చిత్రం రమ్. హృషీకేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సంచితాశెట్టి, మియాజార్జ్ నాయికలుగా నటించారు. వివేక్, నరేన్, అమ్జాద్‌ఖాన్, అర్జున్ చిదంబరం తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయి భరత్ దర్శకత్వం, అనిరుద్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. కార్యక్రమంలో అనిరుద్ మాట్లాడుతూ ఇది తన 13వ చిత్రం అని తెలిపారు. 13 సంఖ్యను చాలా మంది హారర్ సంఖ్యగా బావిస్తారన్నారు. అదే విధంగా తాను చిన్నతనంలో మైడియర్ కుట్టిసాత్తాన్ చిత్రం చూశానన్నారు. అప్పట్లో అది హారర్ కథా చిత్రం అని కూడా తెలియదన్నారు. ఆ తరువాత హారర్ చిత్రాన్నే తాను చూడలేదన్నారు. అలాంటి చిత్రాలంటే తనకు భయం అని అన్నారు. అలాంటిది తొలిసారిగా హారర్ ఇతి వృత్తంతో కూడిన రమ్ చిత్రానికి సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. దర్శకుడు కథను నెరేట్ చేయగానే ఆసక్తి సినిమాపై కలిగిందన్నారు. చిత్రంలో ఏడు పాటలు ఉన్నాయని తెలిపారు. ప్రేక్షకులు తమపై పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయమని అనిరుద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత తనను కలిసి రమ్ చిత్ర వ్యాపారం పూర్తయిందని చెప్పారన్నారు. సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ ఉంటే చిత్రం వ్యాపారం జరగకుండా ఉంటుందా? నిర్మాత తన వద్దకు వచ్చినా తానీ చిత్ర వ్యాపారాన్ని ఏక్ దమ్గా చేసి ఉండేవాడినని పేర్కొన్నారు.