రమ్‌తో నా కోరిక తీరుతుంది! | Sancitasetti about her dream | Sakshi
Sakshi News home page

రమ్‌తో నా కోరిక తీరుతుంది!

Published Wed, Nov 16 2016 2:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

రమ్‌తో నా కోరిక తీరుతుంది!

రమ్‌తో నా కోరిక తీరుతుంది!

మంచి కథా పాత్రలతో ప్రేక్షకుల మదిలో పది కాలాలపాటు గుర్తుండిపోవాలని హీరోహీరోయిన్లు కోరుకుంటుడడం సహజమే. యువ నటి సంచితాశెట్టి అలాంటి కోరికనే వ్యక్తం చేస్తున్నారు. జయంరవి కథానాయకుడిగా నటించిన తిల్లాలంగడి చిత్రంలో నటించి తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంచితాశెట్టి ఆ తరువాత విజయ్‌సేతుపతికు జంటగా సూదుకవ్వుం చిత్రంతో కథానాయకిగా మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆ బ్యూటీ నటించిన రమ్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆల్ ఇన్ పిక్చర్ పతాకంపై నిర్మాత విజయరాఘవేంద్ర నిర్మించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు సాయిభరత్ పరిచయం అవుతున్నారు.

వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో ధనుష్‌కు తమ్ముడిగా నటించి మంచి గుర్తింపు పొందిన హరీష్ ఘోష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా మియాజార్జ్ నటించారు. హస్యనటుడు వివేక్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి నటి సంచితాశెట్టి తెలుపుతూ నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలన్న తన కోరిక ఈ రమ్ చిత్రం ద్వారా తీరుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇందులో తాను నటించిన లియా పాత్రకు అంత ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇది హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అరుునా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగించేదిగా ఉంటుందన్నారు.

ముఖ్యంగా సీనియర్ నటుడు వివేక్ లాంటి వారితో నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు.ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇక ఈ చిత్ర హీరో హరాశ్‌ఘోష్ చాలా శ్రమించి ఎంతో అంకిత భావంతో నటించారని కితాబిచ్చారు.తాను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో తొమ్మిది మంది ప్రతిభావంతులైన సహాయ దర్శకులు, లఘు చిత్రాల దర్శకులతో నటించడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ అమ్మడు నటించిన మరో చిత్రం ఎన్‌కిట్టమోదాదే కూడా వచ్చే నెల విడుదలకు సిద్ధం అవుతోందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement