Vijaysetupati
-
'పుష్ప'లో ఈ పాత్రలను వదులుకున్న స్టార్స్ ఎవరెవరో తెలుసా..?
-
ఏఎం.రత్నం చిత్రంలో విజయ్‌సేతుపతి
పలు బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాత ఏఎం.రత్నం. విశ్వనటుడు కమలహాసన్, అజిత్, విజయ్ వంటి ప్రముఖ కథానాయకులతో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఏఎం.రత్నం నిర్మాణంలో యువ నటుడు విజయ్‌సేతుపతి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. మంచి కంటెంట్ కథా చిత్రాలతో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న విజయ్‌సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కేవీ.ఆనంద్ దర్శకత్వంలో కవన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈయన హీరోగా ఏఎం.రత్నం నిర్మించనున్న తాజా చిత్రానికి రేణిగుంట చిత్రం ఫేమ్ పన్నీర్సెల్లం దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇటీవల విజయ్‌సేతుపతిని కలిసి కథ వినిపించారట. కథ విన్న విజయ్‌సేతుపతి వెంటనే ఓకే చెప్పారట. ఒక పెద్ద నిర్మాణ సంస్థలో ఒక సక్సెస్ఫుల్ హీరోతో చిత్రం చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు పన్నీర్‌సెల్వం తెలిపారు. తన కథలోని పాత్రకు విజయ్‌సేతుపతినే కరెక్ట్‌గా నప్పుతారని అన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ఈ నెల 13న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు తెలిపారు. హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని చెప్పారు. దీనికి సంగీతాన్ని డి.ఇమాన్, ఛాయాగ్రహణం రాంజి అందిస్తున్నట్లు వెల్లడించారు. -
ఆ ఇద్దరి కాంబినేషన్లో విక్రమ్ వేదా
సెలక్టెడ్ చిత్రాలనే చేసే నటుడు మాధవన్, వైవిధ్యభరిత చిత్రాల నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌సేతుపతి కలిసి ఒక చిత్రంలో నటిస్తే ఆ చిత్రం కచ్చితంగా విభిన్నంగా ఉంటుందనడంలో సందేహం ఉండదు. సరిగ్గా అలాంటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్.మాధవన్, విజయ్‌సేతుపతి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి విక్రమ్ వేదా అనే టైటిల్‌ను నిర్ణరుుంచారు. ఇందులో క్రిమీ చిత్రం ఫేమ్ కదిర్, నటి వరలక్ష్మి, యూటర్న్ చిత్రం ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్, ష్రేమ్, అచ్యుత్‌కుమార్, హరీష్‌వర్మ, వివేక్ ప్రసన్న ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకుముందు తమిళ్‌పడమ్, కాదలిల్సొదప్పువదు ఎప్పడి,వాయైమూడి పేసవుమ్, ఇరుదు చుట్రు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వైనాట్ స్టూడియోస్ శశికాంత్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. దీనికి దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు. మాటలను మణికంఠన్, సంగీతాన్ని సీఎస్.శ్యామ్, ఛాయాగ్రహణం పిఎస్.వినోద్ అందిస్తున్నారు. టైడెంట్ ఆర్ట్స్ ఆర్.రవీంద్రన్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. విక్రమ్ వేదా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
రమ్‌తో నా కోరిక తీరుతుంది!
మంచి కథా పాత్రలతో ప్రేక్షకుల మదిలో పది కాలాలపాటు గుర్తుండిపోవాలని హీరోహీరోయిన్లు కోరుకుంటుడడం సహజమే. యువ నటి సంచితాశెట్టి అలాంటి కోరికనే వ్యక్తం చేస్తున్నారు. జయంరవి కథానాయకుడిగా నటించిన తిల్లాలంగడి చిత్రంలో నటించి తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంచితాశెట్టి ఆ తరువాత విజయ్సేతుపతికు జంటగా సూదుకవ్వుం చిత్రంతో కథానాయకిగా మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆ బ్యూటీ నటించిన రమ్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆల్ ఇన్ పిక్చర్ పతాకంపై నిర్మాత విజయరాఘవేంద్ర నిర్మించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు సాయిభరత్ పరిచయం అవుతున్నారు. వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో ధనుష్‌కు తమ్ముడిగా నటించి మంచి గుర్తింపు పొందిన హరీష్ ఘోష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్గా మియాజార్జ్ నటించారు. హస్యనటుడు వివేక్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి నటి సంచితాశెట్టి తెలుపుతూ నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలన్న తన కోరిక ఈ రమ్ చిత్రం ద్వారా తీరుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇందులో తాను నటించిన లియా పాత్రకు అంత ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇది హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అరుునా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగించేదిగా ఉంటుందన్నారు. ముఖ్యంగా సీనియర్ నటుడు వివేక్ లాంటి వారితో నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు.ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇక ఈ చిత్ర హీరో హరాశ్ఘోష్ చాలా శ్రమించి ఎంతో అంకిత భావంతో నటించారని కితాబిచ్చారు.తాను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో తొమ్మిది మంది ప్రతిభావంతులైన సహాయ దర్శకులు, లఘు చిత్రాల దర్శకులతో నటించడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ అమ్మడు నటించిన మరో చిత్రం ఎన్కిట్టమోదాదే కూడా వచ్చే నెల విడుదలకు సిద్ధం అవుతోందన్నది గమనార్హం. -
నయనతార చిత్రంలో విజయ్‌సేతుపతి?
విజయ్‌సేతుపతి, నయనతారలది హిట్ ఫెయిర్ అన్న విషయం తెలిసిందే. నానుమ్ రౌగీదాన్ చిత్రంలో వీరిద్దరూ తొలిసారిగా కలిసి నటించారు. నిజం చెప్పాలంటే ఆ చిత్రంతోనే విజయ్‌సేతుపతి కమర్శియల్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం కవన్. ఇందులో మడోనా సెబాస్టియన్ నాయకిగా నటిస్తున్నారు. టీ.రాజేందర్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కేవీ.ఆనంద్ దర్శకుడు.చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ సంగతి అటుంచితే నయనతార నటిస్తున్న తాజా చిత్రం ఇమైక్కా నోడిగళ్. ఇందులో యువ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి రాశీఖన్నా నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తూ కోలీవుడ్‌కు పరిచయం అవుతుండటం విశేషం. కాగా ఇందులో మురో కీలక పాత్రకు నటుడు విజయ్‌సేతుపతిని ఎంపిక చేసినట్లు సమాచారం. క్యామియో ఫింలిస్ పతాకంపై సీ.జయకుమార్ నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అరుున ఈ చిత్రానికి సంగీతాన్ని హిప్ హాప్ తమిళా, ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రాహణం, మాటల్ని పట్టుకోట ప్రభాకర్ అందిస్తున్నారు. -
పంచ్‌డైలాగ్స్‌కు కష్టపడ్డా!
పంచ్‌డైలాగ్స్ చెప్పడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు నటుడు విజయ్‌సేతుపతి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన నటిస్తున్న తాజా చిత్రాల్లో రెక్క ఒకటి. ఇంతకు ముందు ఆరెంజ్మిఠాయ్ చిత్రాన్ని నిర్మించిన బి.గణేశ్ నిర్మిస్తున్న తాజా చిత్రం రెక్క. రతన్‌శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి లక్ష్మీమీనన్ నాయకిగా నటించారు. దర్శకుడు కేఎస్.రవికుమార్,సతీష్,కిషోర్,శ్రీరంజని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక సత్యం సినిమాల్లో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు కేఎస్.రవికుమార్ ఆవిష్కరించగా దర్శకుడు పన్నీర్‌సెల్వం తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి మాట్లాడుతూ ఆ స్థాయిని తాను ఊహించలేదన్నారు.ఇదంతా మీరు అందించిందే(అభిమానులను ఉద్దేశించి) అని పేర్కొన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు.కాస్త దడగా ఉంది అని అన్నారు.అయితే మీ ఉత్సాహం మాత్రం యమ కిక్కు ఇస్తోందన్నారు.గత శుక్రవారమే ఆండవన్ కట్టళై చిత్రం తెరపైకి వచ్చిందని,ఇప్పుడు రెక్క చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతోందనిఅన్నారు. మరో రెండు వారాల్లో మరో చిత్రం తెరపైకి రానుందని తెలిపారు. ఇదంతా చూస్తుంటే తనకే ఒక మాదిరిగా ఉందన్నారు.ఇలా తన చిత్రాలు వరుసగా విడుదల కావడానికి కాలం అలా అమిరిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చే శారు. కథపైనా,తనపైనా నమ్మకంతో నిర్మాత గణేశ్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించారని అన్నారు.చిత్రంలో నటించడానికి ఎక్కడా శ్రమ పడలేదు గానీ పంచ్‌డైలాగ్స్ చెప్పడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు.ఇందులో నటి లక్ష్మీమీనన్ పాత్ర బాగుంటుందని చెప్పారు. డి.ఇమాన్ చాలా మంచి సంగీతాన్ని అందించారనీ విజయ్‌సేతుపతి తెలిపారు. -
విజయదశమికి రెక్క
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాకు ప్రచారం చాలా అవసరం. అయితే అలాంటి ప్రచారాన్ని ప్రారంభించకుండానే కొన్ని చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటి వాటిలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం రెక్క. అందుకు ఈ చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి ఒక కారణం కావచ్చు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన నటిస్తున్న తాజా చిత్రం రెక్క. ఆయనకు జంటగా లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. రతన్‌శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కామన్మ్మాన్ ప్రెజెంట్స్ పతాకంపై బి.గణేశ్ నిర్మిస్తుండగా డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు రతన్‌శివ తెలుపుతూ విజయ్‌సేతుపతి పర్ఫార్మెన్స్ నటుడిగానే అందరికీ తెలుసన్నారు. అలాంటి ఆయన్ని రెక్క చిత్రం పక్కా యాక్షన్ హీరోగా చూపిస్తుందన్నారు. ఇందులో ఆయన కుంభకోణానికి చెందిన యువకుడిగా నటించ గా నటి లక్ష్మీమీనన్ మదురై అమ్మాయిగా నటించారన్నారు. చిత్రం పేరుకు తగ్గట్టుగానే మదురై, కుంభకోణం, కారైకుడి, బ్యాంకాక్‌లను చుట్టి చిత్రీకరణను పూర్తి చేసుకుందని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్ర హక్కులను సొంతం చేసుకున్న శివబాలన్ పిక్చర్స్ అధినేత అక్టోబర్‌లో ఆయుధపూజ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి సుభా గణేశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
విజయ్‌సేతుపతికి జంటగా లక్ష్మీమీనన్
నటుడు విజయ్‌సేతుపతి,లక్ష్మీమీనన్‌ల ఫ్రెష్ కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుంది. నానుమ్ రౌడీదాన్, సేతుపతి, కాదటుమ్ కడందుపోగుమ్ వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు విజయ్‌సేతుపతి. ఇక కొంబన్, వేదాళం, మిరుదన్ చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ సక్సెస్ఫుల్ నటిగా వాసికెక్కిన నటి లక్ష్మీమీనన్. ఈ లక్కీ జంట కలసి నటిస్తే ఆ చిత్రం క్రేజే వేరు. అలాంటి చిత్రానికి విజయ్‌సేతుపతి, లక్ష్మీమీనన్లపై ఫొటో షూట్ ఇటీవల చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. ఇంతకు ముందు విజయ్‌సేతుపతితో ఆరెంజ్ మిఠాయ్ చిత్రాన్ని నిర్మించిన కామన్ మ్యాన్ ప్రెజెంట్స్ సంస్థ అధినేత బి.గణేష్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా వాడీల్ చిత్రం ఫేమ్ రతన్‌శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మంచి యాక్షన్ అంశాలతో కమర్షియల్ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి రెక్క(వింగ్) అనే టైటిల్‌ను నిర్ణయించారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
ఇద్దరు భామలతో విజయ్ సేతుపతి రొమాన్స్
క్రేజీ ముద్దుగుమ్మలు నయనతార, త్రిష విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నయనతార, త్రిష ఒకప్పుడు నువ్వా నేనా? అని పోటీ పడ్డా, ఈగోలకు పోయి విమర్శించుకున్నా, ఇప్పుడు మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంతగా అంటే పాత విషయాలే గుర్తుకు రానంతగా. కలిసి పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేయడం, ఆ పార్టీల్లో సెల్ఫీలు దిగి ప్రచారం పెంచుకోవడం, ఒకరిని ఒకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం లాంటి విషయాలతో హల్చల్ చేస్తున్నారు. అలాంటి నయనతార, త్రిష కలసి నటించబోతున్నారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారాన్ని త్రిష ఖండించారు. నయనతో నటించాలన్న కోరిక తనకూ ఉందని,అయితే అలాంటి చిత్రంలో నటించమని తననెవరూ అడగలేదని వివరించారు.తాజాగా ఈ నెచ్చెలిలు ఒక క్రేజీ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ ముద్దుగుమ్మలతో యువ నటుడు విజయ్‌సేతుపతి రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారనేది కోలీవుడ్‌లో హల్చల్ చేస్తున్న వార్త. లక్ అంటే ఈ నటుడుదే అనాలి. ఈ మధ్య క్రేజీ హీరోయిన్లతో నటించడంతో పాటు విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన సేతుపతి విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే విజయ్‌సేతుపతితో నయనతార నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నటించారు.ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్ తాజా చిత్రంలోనూ ఆ జంటే నటించనున్నారని సమాచారం. కాకపోతే అదనపు ఎట్రాక్షన్‌గా మరో సంచలన నటి, నయనతార స్నేహితురాలు త్రిష నటించనున్నారట. దీనికి కాత్తు వాంగుల రెండు కాదల్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఒక క్రేజీ చిత్రానికి రంగం సిద్ధమైందన్నది తాజా సమాచారం. -
విజయ్‌సేతుపతితో బాక్సింగ్ బ్యూటీ
ఒక విజయం జాతకాన్నే మార్చేస్తుంది. దానికోసం కొందరు పెద్ద తపమే చేయాల్సి ఉంటుంది. మరికొందరికి అనాయాసంగా వరించేస్తుంది. అలా ఒక్క చిత్రంతోనే విజ యాన్ని అందుకున్న నటి రితిక సింగ్. బాక్సింగ్ క్రీడా రంగంలో ఎదుగుతున్న ఢిల్లీ బ్యూటీ రితిక సింగ్. సినిమా పక్కకే పోవద్దనుకున్న ఈ భామ అనూహ్యంగా ఇరుదు చుట్రు అనే ద్విభాషా(హిందీలో ఖదూస్)చిత్రంలో నటించింది. అందులో తన రియల్ లైఫ్ పాత్రనే పోషించిన రితిక సింగ్‌కు ఆ చిత్రం విపరీతమైన క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. దీంతో మంచి పాత్రలు అనిపిస్తే ఇకపై కూడా నటిస్తానని ఈ అమ్మడు విలేకరుల సమావేశంలో వెల్లడించడంతో పలు అవకాశాలు ఆమె గుమ్మం తలుపులు తడుతున్నాయి. అయితే రితిక ఇప్పుడు కాక్కా ముట్టై చిత్ర దర్శకుడు తాజా చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపింది. కాక్కాముట్టై చిత్రంతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న మణికంఠన్ ఇప్పుడు ఆండవన్ కట్టళై చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో విజయసేతుపతి హీరోగా నటించనున్నారు. ఈయనకు జంటగా రితికసింగ్ నటించనున్నారు. దీనికి క్రిమి చిత్ర దర్శకుడు అనుచరణ్ ఛాయాగ్రహణను అందించనుండటం విశేషం. కే సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రం మార్చి 7న ప్రారంభం కానుంది. ఇది ఫీల్ గుడ్ ఫిల్మ్‌గా ఉంటుందంటున్నారు దర్శకుడు మణికంఠన్. కాగా ప్రస్తుతం ధర్మదురై చిత్రంలో నటిస్తున్న విజయసేతుపతి తదుపరి నటిచనున్న చిత్రం ఇదే. -
మాధవన్‌కు విలన్‌గా విజయ్‌సేతుపతి?
కోలీవుడ్‌లో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. నటుడు మాధవన్‌కు విలన్‌గా విజయ్‌సేతుపతిని నటింపచేసే ప్రత్నాలు జరుగుతున్నాయన్నదే ఆ ప్రచారం. మాధవన్ చాలా గ్యాప్ తరవాత నటించిన తమిళ చిత్రం ఇరుదుచుట్రు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను చూరగొంది. ఆ చిత్ర విలేకరుల సమావేశంలో ఇకపై తమిళ చిత్రాలపై దృష్టి సారిస్తానని మాధవన్ చెప్పడంతో దర్శక, నిర్మాతల చూపు ఆయనపై పడుతోంది. ఇప్పటికే దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి తమ చిత్రంలో మాధవన్‌ను హీరోగా ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆయనకు కథను కూడా వినిపించారు. మాధవన్ పచ్చ జెండా ఊపడమే ఆలస్యం షూటింగ్‌కు రెడీ అంటున్నారు. ఇంతకు ముందు ఓరంపో, వా తదితర చిత్రాలను తెరకెక్కించిన పుష్కర్-గాయత్రి తాజా చిత్రం గురించి తెలుపుతూ మాధవన్‌కు కథ వినిపించిన మాట నిజమేనన్నారు. అయితే ఆయన ఆలోచించుకోవడానికి ఒక వారం గడువు అడిగారని చెప్పారు. ఇది తమ గత చిత్రాలకు మాత్రమే కాకుండా మాధవన్ ఇంతకు ముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో విజయ్‌సేతుపతిని నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ టాక్. అయితే హీరోగా ఫుల్ బిజీలో ఉన్న ఆయన విలన్‌గా అంగీకరిస్తారా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. -
చెన్నైలో సినిమా సందడి
ఏ కార్యానికైనా దైవసంకల్పం ఉండాలి. అలాంటి పనికి మంచి ముహూర్తం అవసరం అ వుతుంది. ఇక సినిమా రంగంలో సెంటిమెంట్ ఎక్కువ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుధవారం భీష్మ ఏకాదశి. దివ్యమైన రోజు కావడంతో కోలీవుడ్ చిత్రాల ప్రారంభోత్సవాలతో కళకళలాడింది. ఏక కాలంలో మూడు చిత్రాల ప్రారంభోత్సవాలు. ఒక చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అంటూ సందడి వాతావరణం నెలకొంది. వీటిలో నటుడు భరత్ కథానాయకుడిగా నటిస్తున్న పొట్టు చిత్రం, విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్న నూతన చిత్రం, ఆరి హీరో గా నటిస్తున్న ఉన్నోడు కా చిత్రాలతో పాటు విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న సేతుపతి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చోటు చేసుకున్నాయి. విజయ్‌సేతుపతి తొలిసారిగా పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం సేతుపతి.ఆయనకు జంటగా రమ్యానంబీశన్ నటిస్తున్నారు. పిజ్జా వంటి విజయవంతమైన చిత్ర తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. దీనికి ఎస్‌యూ.అరుణ్‌కుమార్ దర్శకుడు.ఇంతకు ముందు ఈయన విజయ్‌సేతుపతి హీరోగా పణైయారుం పద్మియుమ్ చిత్రాన్ని తెరకెక్కిం చారన్నది గమనార్హం. ఇది ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం అని దర్శకుడు పేర్కొన్నారు. పోలీస్ అధికారిగా నటిస్తున్న విజయ్‌సేతుపతి పాత్ర బాధ్య త గల భర్తగానూ, ప్రేమాభిమానాలుగల తం డ్రిగానూ ఉంటుందన్నారు. పోలీస్ కథలతో ఇంతకు ముందు పలు చిత్రాలు వచ్చినా సేతుపతి వాటికి పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. షాన్ సుదర్శన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవి ష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం నగరంలోని సత్యం సినీ మాల్లో జరిగింది. నటు డు సిద్ధార్థ్ పాల్గొని ఆడియోను ఆవిష్కరించా రు. ఇక రెండో చిత్రం పొట్టు. నటుడు భరత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనతో నమిత, ఇనియ, మనీషాయదవ్ ముగ్గురు కథానాయికలు నటించడం విశేషం.దీన్ని షాలో మ్ స్టూడియోస్ పతాకంపై జాన్‌మ్యాక్స్,జాన్స్ లు నిర్మిస్తున్నారు. షావుకార్ పేట్టై చిత్రం త్వర లో విడుదలకు సిద్ధం అవుతోంది.ఆ చిత్ర దర్శకుడు వీసీ.వడివుడైయాన్కే తాజాగా పొట్టు చిత్రానికి కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించడం విశే షం. దీనికి సీనియర్ నటి జయచిత్ర కొడుకు అ మ్రిష్ సంగీత బాణీలు అందిస్తున్నారు. పొట్టు చిత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యా యి. ఇకపోతే యువ నటుడు విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం స్థానిక నుంగంబాక్కంలో ప్రారంభమైంది.సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ అధినేత టీజీ.త్యాగరాజన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. మలయాళ కుట్టి మంజిమా మీనన్ నాయకిగా నటిస్తున్నారు. ఎస్ఆర్.ప్రభాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.ఇక ఇదే రోజున ప్రారంభం అయిన మరో చిత్రం ఉన్నోడు కా.అభిరామిరామనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వర్ధమాన నటుడు ఆరి హీరోగా నటిస్తున్నారు. ఆర్రే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సత్య సంగీతా న్ని అందిస్తున్నారు.వినోదమే ప్రధానంగా రూపొందుతున్న చిత్రం ఉన్నోడు .