చెన్నైలో సినిమా సందడి
ఏ కార్యానికైనా దైవసంకల్పం ఉండాలి. అలాంటి పనికి మంచి ముహూర్తం అవసరం అ వుతుంది. ఇక సినిమా రంగంలో సెంటిమెంట్ ఎక్కువ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుధవారం భీష్మ ఏకాదశి. దివ్యమైన రోజు కావడంతో కోలీవుడ్ చిత్రాల ప్రారంభోత్సవాలతో కళకళలాడింది. ఏక కాలంలో మూడు చిత్రాల ప్రారంభోత్సవాలు. ఒక చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అంటూ సందడి వాతావరణం నెలకొంది. వీటిలో నటుడు భరత్ కథానాయకుడిగా నటిస్తున్న పొట్టు చిత్రం, విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్న నూతన చిత్రం, ఆరి హీరో గా నటిస్తున్న ఉన్నోడు కా చిత్రాలతో పాటు విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న సేతుపతి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చోటు చేసుకున్నాయి.
విజయ్‌సేతుపతి తొలిసారిగా పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం సేతుపతి.ఆయనకు జంటగా రమ్యానంబీశన్ నటిస్తున్నారు. పిజ్జా వంటి విజయవంతమైన చిత్ర తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. దీనికి ఎస్‌యూ.అరుణ్‌కుమార్ దర్శకుడు.ఇంతకు ముందు ఈయన విజయ్‌సేతుపతి హీరోగా పణైయారుం పద్మియుమ్ చిత్రాన్ని తెరకెక్కిం చారన్నది గమనార్హం. ఇది ఒక పవర్‌ఫుల్ పోలీస్ అధికారి ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం అని దర్శకుడు పేర్కొన్నారు. పోలీస్ అధికారిగా నటిస్తున్న విజయ్‌సేతుపతి పాత్ర బాధ్య త గల భర్తగానూ, ప్రేమాభిమానాలుగల తం డ్రిగానూ ఉంటుందన్నారు. పోలీస్ కథలతో ఇంతకు ముందు పలు చిత్రాలు వచ్చినా సేతుపతి వాటికి పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
షాన్ సుదర్శన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవి ష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం నగరంలోని సత్యం సినీ మాల్‌లో జరిగింది. నటు డు సిద్ధార్థ్ పాల్గొని ఆడియోను ఆవిష్కరించా రు. ఇక రెండో చిత్రం పొట్టు. నటుడు భరత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనతో నమిత, ఇనియ, మనీషాయదవ్ ముగ్గురు కథానాయికలు నటించడం విశేషం.దీన్ని షాలో మ్ స్టూడియోస్ పతాకంపై జాన్‌మ్యాక్స్,జాన్స్ లు నిర్మిస్తున్నారు. షావుకార్ పేట్టై చిత్రం త్వర లో విడుదలకు
సిద్ధం అవుతోంది.ఆ చిత్ర దర్శకుడు వీసీ.వడివుడైయాన్‌కే తాజాగా పొట్టు చిత్రానికి కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించడం విశే షం. దీనికి సీనియర్ నటి జయచిత్ర కొడుకు అ మ్రిష్ సంగీత బాణీలు అందిస్తున్నారు. పొట్టు చిత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యా యి. ఇకపోతే యువ నటుడు విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం స్థానిక నుంగంబాక్కంలో ప్రారంభమైంది.సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ అధినేత టీజీ.త్యాగరాజన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. మలయాళ కుట్టి మంజిమా మీనన్ నాయకిగా నటిస్తున్నారు. ఎస్‌ఆర్.ప్రభాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.ఇక ఇదే రోజున ప్రారంభం అయిన మరో చిత్రం ఉన్నోడు కా.అభిరామిరామనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వర్ధమాన నటుడు ఆరి హీరోగా నటిస్తున్నారు. ఆర్‌రే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సత్య సంగీతా న్ని అందిస్తున్నారు.వినోదమే ప్రధానంగా రూపొందుతున్న చిత్రం ఉన్నోడు .