Vikramprabhu
-
27న తెరపైకి ‘పక్కా’
తమిళసినిమా: ఈ నెల 27న తెరపైకి రావడానికి ‘పక్కా’చిత్రం రెడీ అవుతోంది. నటుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటించిన చిత్రం పక్కా. ఆయనతో నటి నిక్కీగల్రాణి, బిందుమాధవి నాయికలుగా నటించారు. చిత్రంలో సూరి, సతీష్, ఆనంద్‌రాజ్, నిళల్‌గళ్‌రవి, సింగముత్తు, సింగంపులి, రవిమరియ, వైయాపురి, ఇమాన్‌అన్నాచ్చి, జయమణి, కృష్ణమూర్తి, ముత్తుకాళై, సిజర్‌మనోహర్, సుజాత, నాట్టామైరాణి, సాయిదీనా ముఖ్య పాత్రలను పోషించారు. పెణ్ కన్‌స్టోరిటియం పతాకంపై టి.శివకుమార్ ముఖ్య పాత్రలో నటించి, నిర్మించిన ఈ చిత్రానికి బి.శరవణన్ సహనిర్మాతగా వ్యవహరించారు. ఎస్ఎస్.సూర్య కథ, కథనం, మాటలు, దర్శకత్వం వహించారు. ఎస్.శరవణన్ ఛాయాగ్రహణం, సి.సత్య సంగీతం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా వినోద ప్రధానంగా తెరకెక్కించిన చిత్రమన్నారు. నటుడు విక్రమ్‌ప్రభును కొత్తగా చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఆయన కేరీర్‌లోనే ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. హీరోయిన్లు నిక్కీగల్రాణి, బిందుమాధవి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పలువురు హాస్యనటులు చిత్రంలో నటించడం విశేషమన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
అలా ఉండడం నా వల్ల కాదు
కామ్‌గా ఉండడం నా వల్ల కాదు అంటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ చిత్రంతో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నిక్కీగల్రాణి విక్రమ్‌ప్రభుకు జంటగా నటించిన నెరుప్పుడా చిత్రం గత శుక్రవారం తెరపైకి విచ్చి సక్సెస్‌ఫుల్‌గా పరిగెడుతోంది. గౌతమ్ కార్తీక్ సరసన నటించిన హర హర మహాదేవకి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న నిక్కీగల్రాణి మాటామంతి.. – తమిళసినిమా ప్ర: నెరుప్పుడా చిత్రంలో మీ పాత్ర గురించి? జ: ఈ చిత్రంలో వైద్యవిద్యార్థినిగా నటించాను. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పాత్రను పోషించలేదు. చాలా వైవిధ్యం కలిగిన పాత్ర. ఇందులో నా పాత్ర నిప్పుల్లో నుంచే ప్రారంభం అవుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా రిస్క్ తీసుకుని నటించాను. మరో విషయం ఏమిటంటే నేను డాక్టరు కావాలన్నది మా అమ్మ ఆశ. అలా వైద్యవిద్యను చదివిన నేను దిశ మారి సినిమా రంగంలోకి ప్రవేశించాను. ఇదీ మంచికే అనుకుంటున్నాను. ప్ర: విక్రమ్‌ప్రభుతో నటించిన అనుభవం? జ: చాలా మంచి అనుభవం. విక్రమ్‌ప్రభు సెట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. నెరుప్పుడా చిత్రానికి ఆయనే నిర్మాత. అయినా ఎలాంటి టెన్షన్ పడ్డట్టు నేను చూడలేదు. ఇక మర్యాద, ప్రేమ విషయాల్లో విక్రమ్‌ప్రభు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్ర: చిత్రాల ఎంపికలో మీరు తీసుకునే జాగ్రత్తలు? జ: అందర్నీ ఆలోచింపజేసే కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలన్నదే నా కోరిక. అలాంటి పాత్రలను చాలెంజింగ్‌గా తీసుకుని నటిస్తాను. ఒక సారి నటించిన పాత్రలో మళ్లీ నటించకుండా వైవిధ్యంగా ఉండే పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. అందుకే సక్సెస్ఫుల్ నటిగా కొనసాగిస్తున్నాను. ప్ర: ఇంత సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తారని ముందుగా ఊహించారా? జ: నిజం చెప్పాలంటే నేను నటినవుతానని ఊహించలేదు. నటి అయిన తరువాత ఇంతగా నిలదొక్కుకుంటానని అనుకోలేదు. నాలుగు తమిళ చిత్రాలు, రెండు మలయాళం, తెలుగు అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ప్ర: సంగీతదర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ మిమ్మల్ని చూసి భయపడతారట? జ: షూటింగ్ సెట్లో గానీ, బయట గానీ కామ్‌గా ఉండడం అన్నది నా వల్ల కాని పని. సరదాగా మాట్లాడుతూ సందడి చేస్తుంటాను. అందుకు విరుద్ధంగా జీవీ.ప్రకాశ్‌కుమార్ ప్రశాంతంగా ఉంటే నేనేం చేయను. -
8న నిప్పురా అంటున్న విక్రమ్‌ప్రభు
తమిళసినిమా: యువ నటుడు విక్రమ్‌ప్రభుకు ఇప్పుడో హిట్ చాలా అవసరం. నటుడిగా ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవకపోయినా, ఇటీవల తను నటించిన చిత్రాలు అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయాయన్నది మాత్రం వాస్తవం. అయితే నటుడిగా తానేమిటో తొలి చిత్రం కుంకీతోనే నిరూపించుకున్నారు. కాగా మరోసారి తన సత్తా చాటడానికి నెరుప్పడా(నిప్పురా) అంటూ రానున్నారు.విశేషం ఏమిటంటే ఈ చిత్రంతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. విక్రమ్‌ప్రభు నిర్మాతగా ఫస్ట్ ఆర్టిస్ట్ బ్యానర్‌ను ప్రారంభించి నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం నెరుప్పుడా. సూపర్‌స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రంలోని నెరుప్పుడా పాట ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యిందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా అలాంటి పవర్ఫుల్ టైటిల్‌కు ఆయన అనుమతి పొంది నిర్మించిన ఇందులో సక్సెస్ఫుల్ హీరోయిన్ నిక్కీగల్రాణి విక్రమ్‌ప్రభుకు జంటగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో వరుణ్, నాన్కడవుల్రాజేంద్రన్, నాగిరెడ్డి, ఆడుగళం నరేన్ నటించిన ఈ చిత్రాన్ని శ్యాన్ రోనాల్డ్ సంగీతం అందించారు. నవ దర్శకుడు ఏ.అశోక్‌కుమార్ దర్శకత్వం వహించిన ఇందులో విక్రమ్‌ప్రభు ఫైర్‌మ్యాన్‌గా పవర్ఫుల్ పాత్రలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్తో నెరుప్పుడా చిత్రం సెప్టెంబర్ 8వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. -
తెరపైకి షామిలి తొలిచిత్రం
నటి షామిలి ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న వీరశివాజీ చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది.కారణం నాయకిగా కోలీవుడ్‌లో ఆమె తొలి చిత్రం ఇదే కావడం. బాల నటిగా పలు భాషల్లో అనేక చిత్రాలు చేసిన బేబి షామిలి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అలాంటిది హీరోరుున్‌గా తొలుత తెలుగులో పరిచయమైనా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.దీంతో నటనకు కాస్త విరామం పలికి అమెరికా వెళ్లి సినిమాకు సంబంధించిన చదువు చదివి చెన్నైకి తిరిగొచ్చిన తరువాత నటించిన మొదటి చిత్రం వీరశివాజీ. విక్రమ్‌ప్రభు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్ అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్ప్రైజెస్ అధినేత ఎస్.నందకుమార్ నిర్మించారు. జాన్‌విజయ్, రోబోశంకర్, యోగిబాబు, నాన్‌కడవుల్ రాజేంద్రన్, మనీషాశ్రీ,వినోదిని, దర్శకుడు మారిముత్తు, సాతన్య,కుట్టి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను గణేశ్ వినాయక్ నిర్వహించారు. చాలా రోజుల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసి ఉండగా, ఈ చిత్ర నిర్మాతే విశాల్, తమన్నా జంటగా కత్తిసండై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని విడుదల చేసి ఆ తరువాత వీరశివాజీని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. తాజాగా కత్తిసండై చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దించాలని నిర్ణరుుంచిన యూనిట్ వర్గాలు ముందుగా విక్రమ్‌ప్రభు, వీరశివాజీ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. ఆ విధంగా వీరశివాజీ చిత్రం ఈ నెల 16న తెరపైకి రానుంది. -
చెన్నైలో సినిమా సందడి
ఏ కార్యానికైనా దైవసంకల్పం ఉండాలి. అలాంటి పనికి మంచి ముహూర్తం అవసరం అ వుతుంది. ఇక సినిమా రంగంలో సెంటిమెంట్ ఎక్కువ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుధవారం భీష్మ ఏకాదశి. దివ్యమైన రోజు కావడంతో కోలీవుడ్ చిత్రాల ప్రారంభోత్సవాలతో కళకళలాడింది. ఏక కాలంలో మూడు చిత్రాల ప్రారంభోత్సవాలు. ఒక చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అంటూ సందడి వాతావరణం నెలకొంది. వీటిలో నటుడు భరత్ కథానాయకుడిగా నటిస్తున్న పొట్టు చిత్రం, విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్న నూతన చిత్రం, ఆరి హీరో గా నటిస్తున్న ఉన్నోడు కా చిత్రాలతో పాటు విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న సేతుపతి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చోటు చేసుకున్నాయి. విజయ్‌సేతుపతి తొలిసారిగా పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం సేతుపతి.ఆయనకు జంటగా రమ్యానంబీశన్ నటిస్తున్నారు. పిజ్జా వంటి విజయవంతమైన చిత్ర తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. దీనికి ఎస్‌యూ.అరుణ్‌కుమార్ దర్శకుడు.ఇంతకు ముందు ఈయన విజయ్‌సేతుపతి హీరోగా పణైయారుం పద్మియుమ్ చిత్రాన్ని తెరకెక్కిం చారన్నది గమనార్హం. ఇది ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం అని దర్శకుడు పేర్కొన్నారు. పోలీస్ అధికారిగా నటిస్తున్న విజయ్‌సేతుపతి పాత్ర బాధ్య త గల భర్తగానూ, ప్రేమాభిమానాలుగల తం డ్రిగానూ ఉంటుందన్నారు. పోలీస్ కథలతో ఇంతకు ముందు పలు చిత్రాలు వచ్చినా సేతుపతి వాటికి పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. షాన్ సుదర్శన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవి ష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం నగరంలోని సత్యం సినీ మాల్లో జరిగింది. నటు డు సిద్ధార్థ్ పాల్గొని ఆడియోను ఆవిష్కరించా రు. ఇక రెండో చిత్రం పొట్టు. నటుడు భరత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనతో నమిత, ఇనియ, మనీషాయదవ్ ముగ్గురు కథానాయికలు నటించడం విశేషం.దీన్ని షాలో మ్ స్టూడియోస్ పతాకంపై జాన్‌మ్యాక్స్,జాన్స్ లు నిర్మిస్తున్నారు. షావుకార్ పేట్టై చిత్రం త్వర లో విడుదలకు సిద్ధం అవుతోంది.ఆ చిత్ర దర్శకుడు వీసీ.వడివుడైయాన్కే తాజాగా పొట్టు చిత్రానికి కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించడం విశే షం. దీనికి సీనియర్ నటి జయచిత్ర కొడుకు అ మ్రిష్ సంగీత బాణీలు అందిస్తున్నారు. పొట్టు చిత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యా యి. ఇకపోతే యువ నటుడు విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం స్థానిక నుంగంబాక్కంలో ప్రారంభమైంది.సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ అధినేత టీజీ.త్యాగరాజన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. మలయాళ కుట్టి మంజిమా మీనన్ నాయకిగా నటిస్తున్నారు. ఎస్ఆర్.ప్రభాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.ఇక ఇదే రోజున ప్రారంభం అయిన మరో చిత్రం ఉన్నోడు కా.అభిరామిరామనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వర్ధమాన నటుడు ఆరి హీరోగా నటిస్తున్నారు. ఆర్రే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సత్య సంగీతా న్ని అందిస్తున్నారు.వినోదమే ప్రధానంగా రూపొందుతున్న చిత్రం ఉన్నోడు . -
విక్రమ్‌ప్రభుతో షామిలి రొమాన్స్
15 ఏళ్ల క్రితం నట బాల మేధావిగా ప్రశంసలు అందుకున్న షామిలి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికాలో సినిమాకు సంబంధించిన విద్య నభ్యసించిన నటి షాలిని చెల్లలు. అజిత్ మరదలు షామిలి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. కారణం కోలీవుడ్‌లో హీరోయిన్గా ఆమె తెరంగేట్రం విషయమై సమీప కాలంలో చాలా రకాలుగా ప్రచారం జరుగుతోంది.15 ఏళ్ల క్రితం నటించిన కండుకొండేన్ కండుకొండేన్ బాల నటిగా షామిలి చివరి చిత్రం. ఆ తరువాత ఆమె కోలీవుడ్‌లో నటించలేదు. అయితే కథానాయకిగా తెలుగులో ఓయ్ అనే చిత్రంతో పరిచయం అయ్యారు. హీరోయిన్గా షామిలి ఏకైక చిత్రం అదొక్కటే. ఈ మధ్యనే అమెరికా నుంచి తిరిగొచ్చిన ఈ బ్యూటీ నటించడానికి రెడీ అనడంతో చాలా మంది తమిళ చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాల్లో నటింపజేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక తాజా సమాచారం ఏమిటంటే సక్సెస్ చిత్రాల యువ నటుడు, మహా నటుడు శివాజీగణేశన్ మనవడు, ప్రభు వారసుడు విక్రమ్‌ప్రభుతో జత కట్టడానికి షామిలి సిద్ధం అవుతున్నారన్నది. దీనికి వీరశివాజీ అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. ఇంతకు ముందు తగరారు చిత్రాన్ని తెరకెక్కించిన గణేశ్వినయన్ ఈ చిత్రానికి దర్శకత్వం బాధ్యతల్ని చేపట్టనున్నారు. కామెడీ,యాక్షన్ ప్రధానాంశాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి చాయాగ్రహణాన్ని సుకుమార్, కళాదర్శకత్వాన్ని ఇళయరాజా,కూర్పు బాధ్యతన్ని రూబెన్ నిర్వహించనున్నారు.