తెరపైకి షామిలి తొలిచిత్రం | Screen debut in the film samili | Sakshi
Sakshi News home page

తెరపైకి షామిలి తొలిచిత్రం

Published Sun, Dec 4 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

తెరపైకి షామిలి తొలిచిత్రం

తెరపైకి షామిలి తొలిచిత్రం

నటి షామిలి ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న వీరశివాజీ చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది.కారణం నాయకిగా కోలీవుడ్‌లో ఆమె తొలి చిత్రం ఇదే కావడం. బాల నటిగా పలు భాషల్లో అనేక చిత్రాలు చేసిన బేబి షామిలి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అలాంటిది హీరోరుున్‌గా తొలుత తెలుగులో పరిచయమైనా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.దీంతో నటనకు కాస్త విరామం పలికి అమెరికా వెళ్లి సినిమాకు సంబంధించిన చదువు చదివి చెన్నైకి తిరిగొచ్చిన తరువాత నటించిన మొదటి చిత్రం వీరశివాజీ. విక్రమ్‌ప్రభు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్ అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత ఎస్.నందకుమార్ నిర్మించారు.

జాన్‌విజయ్, రోబోశంకర్, యోగిబాబు, నాన్‌కడవుల్ రాజేంద్రన్, మనీషాశ్రీ,వినోదిని, దర్శకుడు మారిముత్తు, సాతన్య,కుట్టి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను గణేశ్ వినాయక్ నిర్వహించారు. చాలా రోజుల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసి ఉండగా, ఈ చిత్ర నిర్మాతే విశాల్, తమన్నా జంటగా కత్తిసండై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని విడుదల చేసి ఆ తరువాత వీరశివాజీని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. తాజాగా కత్తిసండై చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దించాలని నిర్ణరుుంచిన యూనిట్ వర్గాలు ముందుగా విక్రమ్‌ప్రభు, వీరశివాజీ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. ఆ విధంగా వీరశివాజీ చిత్రం ఈ నెల 16న తెరపైకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement