Oy! Re Release: థియేటర్‌లో యువతి మాస్‌ స్టెప్పులు.. వీడియో వైరల్‌ | Young Woman Dancer For Oy Movie Song In Theater | Sakshi
Sakshi News home page

Oy! Re Release: థియేటర్‌లో యువతి మాస్‌ స్టెప్పులు.. ‘ఓయ్‌..’ పిల్ల ఇరగదీశావ్‌గా!

Published Thu, Feb 15 2024 5:30 PM | Last Updated on Thu, Feb 15 2024 5:43 PM

Young Woman Dancer For Oy Movie Song In Theater - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ప్రతి నెల నాలుగైదు పాత సినిమాలను మళ్లీ ఒక్కరోజు థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కేవలం స్టార్‌ హీరోల సినిమాలు మాత్రమే రీరిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలన్నీ మళ్లీ రీరిలీజ్‌ చేస్తున్నారు. ప్రేమికుల రోజు ఏకంగా 9 సినిమాలను రీరిలీజ్‌ అయ్యాయి. అయితే వాటిల్లో ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్‌ అయిన మూవీ ఓయ్‌. సిద్ధార్థ్‌, షామిలీ హీరోయిన్లుగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2009లో రిలీజైంది.

అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కానీ టీవీల్లోకి వచ్చిన తర్వాత విశేష ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని బాగా ఆదరించింది. అందుకే ప్రేమికుల రోజు ఈ మూవీని మళ్లీ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది.  ప్రేక్షకులు థియేటర్ లో ఓయ్ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.

ముఖ్యంగా అమ్మాయిలు ఈ చిత్రానికి బాగా కనెక్ట్‌ అయ్యారు. దానికి ఈ వీడియోనే నిదర్శనం. రీరిలీజ్‌లో భాగంగా నిన్న వైజాగ్‌లోని ఓ థియేటర్స్‌లో  ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మూవీ చూసేందుకు వచ్చిన ఓ అమ్మాయి.. తన డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. ఎల్లో శారీలో వచ్చిన ఆ యువతి.. ఓయ్‌ సినిమాలోని ప్రతి పాటకు ఊర మాస్‌ స్టెప్పులేసి ఆకట్టుకుంది.  హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా స్టెప్పులేస్తూ..అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement