‘ఓయ్’ అమ్మాయి మళ్లీ వచ్చింది..! | Shamili Re Entry with Ammammagarillu | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 3 2018 11:23 AM | Last Updated on Wed, Jan 3 2018 1:14 PM

Shamili Re Entry with Ammammagarillu - Sakshi

బాలనటిగానే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న షామిలి హీరోయిన్ గా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ఓయ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన షామిలి, తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా  ఆ సినిమాలో షామిలి లుక్ విషయంలో కూడా విమర్శలు రావటంతో కాస్త స్లిమ్ అయ్యి కోలీవుడ్ మీద దృష్టి పెట్టింది.

కోలీవుడ్ లో బిజీ అవుతున్న ఈ భామ, మరోసారి టాలీవుడ్ వైపు అడుగులేస్తోంది.ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సుందర్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో వేసవిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement