రోహిత్ సరసన 'కథలో రాజకుమారి'గా.. | Shamili re entry with nara rohith | Sakshi

రోహిత్ సరసన 'కథలో రాజకుమారి'గా..

Oct 2 2015 2:29 PM | Updated on Sep 3 2017 10:21 AM

రోహిత్ సరసన 'కథలో రాజకుమారి'గా..

రోహిత్ సరసన 'కథలో రాజకుమారి'గా..

బాలనటిగా జాతీయ స్థాయిలోగుర్తింపు తెచ్చుకున్న నటి షామిలి. తరువాత 'ఓయ్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్ధాయిలో విజయం సాదించలేకపోయింది. ముఖ్యంగా లుక్ విషయంలో తీవ్రంగా...

బాలనటిగా జాతీయ స్థాయిలోగుర్తింపు తెచ్చుకున్న నటి షామిలి. తరువాత 'ఓయ్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్ధాయిలో విజయం సాధించలేకపోయింది. ముఖ్యంగా లుక్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచిన షామిలి ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఈ సినిమా తర్వాత వెండితెరకు గుడ్ బై చెప్పిన షామిలి, ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది.

ఇటీవల ఉన్నత చదువులు ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చిన షామిలి ఫోటోషూట్స్ తో హల్చల్ చేస్తుంది. అక్క బావలు షాలిని, అజిత్లకు ఉన్న పరిచయాలతో సినిమా ప్రయత్నాలు కూడా మొదలెట్టేసింది. షామిలి చేసిన ఫోటో షూట్ లకు మంచి స్పందనే వస్తోంది. ఇప్పటికే చాలామంది తమిళ దర్శకులు షామిలితో సినిమాకు రెడీ అయిపోయారు.

తెలుగులో కూడా ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు కమిట్ అవుతోంది షామిలి. నారా రోహిత్ హీరోగా కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని తెరకెక్కిస్తున్న 'కథలో రాజకుమారి' సినిమాలో హీరోయిన్గా నటించేందుకు అంగీకరించింది. మరి రీ ఎంట్రీ లో అయినా షామిలి అలరిస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement