ధనుష్ చిత్రం నుంచి తప్పుకున్న షామిలి
లిటిల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న బాల నటి షామిలి ఇప్పుడు హీరోయిన్‌గా రంగప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే తెలుగులో ఓయ్ అనే చిత్రంలో కథానాయకిగా నటించిన షామిలి తమిళంలో మాత్రం ఇప్పుడే పరిచయం అవుతున్నారు. ఒకే సారి రెండు చిత్రాలను అంగీకరించారు. అందులో ఒకటి వీర శివాజీ, రెండోది కొడి చిత్రం. వీర శివాజీ చిత్రంలో విక్రమ్‌ప్రభుతో నటిస్తున్నారు. ఇక కొడి చిత్రంలో ధనుష్‌తో రొమాన్స్ చేయడానికే షామిలికి కాలం కలిసిరాలేదు.
ప్రభుసాలమన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసిన ధనుష్ తాజాగా కొడి చిత్రంలో నటిస్తున్నారు. దురెసైంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షామిలి, త్రిషలను ఎంపిక చేశారు. దనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినం చేస్తున్న ఇందులో త్రిష ప్రతినాయకిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేయడానికి యూనిట్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం వీరశివాజీ చిత్రంలో నటిస్తున్న షామిలి ధనుష్ చిత్రానికి కాల్‌షీట్స్ సర్దుబాటు చేయలేక పోయారట.
దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించి కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రం ఫేమ్ మడోనాను కొడి చిత్ర నిర్మాతలు ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్,ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్ నిర్మిస్తున్నారు. కొడి చిత్రం నుంచి వైదొలగడం గురించి నటి షామిలి తరపు నుంచి తెలిసిందేమిటంటే అందులో ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తగ్గించడం వల్లే ఆ చిత్రాన్ని వదులుకున్నారని. ఏదేమైనా ధనుష్ చిత్రం నుంచి షామిలి తప్పుకోవడం టాక్ ఆష్ ది ఇండస్ట్రీగా మారింది.