పంచ్‌డైలాగ్స్‌కు కష్టపడ్డా! | Rekka Tamil Movie Audio Launch | Sakshi
Sakshi News home page

పంచ్‌డైలాగ్స్‌కు కష్టపడ్డా!

Published Mon, Sep 26 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

పంచ్‌డైలాగ్స్‌కు కష్టపడ్డా!

పంచ్‌డైలాగ్స్‌కు కష్టపడ్డా!

పంచ్‌డైలాగ్స్ చెప్పడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు నటుడు విజయ్‌సేతుపతి.  వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన నటిస్తున్న తాజా చిత్రాల్లో రెక్క ఒకటి. ఇంతకు ముందు ఆరెంజ్‌మిఠాయ్ చిత్రాన్ని నిర్మించిన బి.గణేశ్ నిర్మిస్తున్న తాజా చిత్రం రెక్క. రతన్‌శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి లక్ష్మీమీనన్ నాయకిగా నటించారు. దర్శకుడు కేఎస్.రవికుమార్,సతీష్,కిషోర్,శ్రీరంజని  ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక సత్యం సినిమాల్‌లో జరిగింది.

 చిత్ర ఆడియోను దర్శకుడు కేఎస్.రవికుమార్ ఆవిష్కరించగా దర్శకుడు పన్నీర్‌సెల్వం తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి మాట్లాడుతూ ఆ స్థాయిని తాను ఊహించలేదన్నారు.ఇదంతా మీరు అందించిందే(అభిమానులను ఉద్దేశించి) అని పేర్కొన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు.కాస్త దడగా ఉంది అని అన్నారు.అయితే మీ ఉత్సాహం మాత్రం యమ కిక్కు ఇస్తోందన్నారు.గత శుక్రవారమే ఆండవన్ కట్టళై చిత్రం తెరపైకి వచ్చిందని,ఇప్పుడు రెక్క చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతోందనిఅన్నారు.

మరో రెండు వారాల్లో మరో చిత్రం తెరపైకి రానుందని తెలిపారు. ఇదంతా చూస్తుంటే తనకే ఒక మాదిరిగా ఉందన్నారు.ఇలా తన చిత్రాలు వరుసగా విడుదల కావడానికి కాలం అలా అమిరిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చే శారు. కథపైనా,తనపైనా నమ్మకంతో నిర్మాత గణేశ్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించారని అన్నారు.చిత్రంలో నటించడానికి ఎక్కడా శ్రమ పడలేదు గానీ పంచ్‌డైలాగ్స్ చెప్పడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు.ఇందులో నటి లక్ష్మీమీనన్ పాత్ర బాగుంటుందని  చెప్పారు. డి.ఇమాన్ చాలా మంచి సంగీతాన్ని అందించారనీ విజయ్‌సేతుపతి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement