ఏఎం.రత్నం చిత్రంలో విజయ్‌సేతుపతి | vijaysetupati in am. rantnam movie | Sakshi

ఏఎం.రత్నం చిత్రంలో విజయ్‌సేతుపతి

Dec 17 2016 1:59 AM | Updated on Sep 4 2017 10:53 PM

ఏఎం.రత్నం చిత్రంలో విజయ్‌సేతుపతి

ఏఎం.రత్నం చిత్రంలో విజయ్‌సేతుపతి

పలు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల నిర్మాత ఏఎం.రత్నం. విశ్వనటుడు కమలహాసన్, అజిత్, విజయ్‌ వంటి ప్రముఖ కథానాయకులతో విజయవంతమైన

పలు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల నిర్మాత ఏఎం.రత్నం. విశ్వనటుడు కమలహాసన్, అజిత్, విజయ్‌ వంటి ప్రముఖ కథానాయకులతో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఏఎం.రత్నం నిర్మాణంలో యువ నటుడు విజయ్‌సేతుపతి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. మంచి కంటెంట్‌ కథా చిత్రాలతో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న విజయ్‌సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో కవన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈయన హీరోగా ఏఎం.రత్నం నిర్మించనున్న తాజా చిత్రానికి రేణిగుంట చిత్రం ఫేమ్‌ పన్నీర్‌సెల్లం దర్శకత్వం వహిస్తున్నారు.

ఈయన ఇటీవల విజయ్‌సేతుపతిని కలిసి కథ వినిపించారట. కథ విన్న విజయ్‌సేతుపతి వెంటనే ఓకే చెప్పారట. ఒక పెద్ద నిర్మాణ సంస్థలో ఒక సక్సెస్‌ఫుల్‌ హీరోతో చిత్రం చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు పన్నీర్‌సెల్వం తెలిపారు. తన కథలోని పాత్రకు విజయ్‌సేతుపతినే కరెక్ట్‌గా నప్పుతారని అన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ఈ నెల 13న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు తెలిపారు. హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని చెప్పారు. దీనికి సంగీతాన్ని డి.ఇమాన్, ఛాయాగ్రహణం రాంజి అందిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement