నయనతార చిత్రంలో విజయ్‌సేతుపతి? | Vijaysetupati in Nayantara film? | Sakshi
Sakshi News home page

నయనతార చిత్రంలో విజయ్‌సేతుపతి?

Published Tue, Nov 1 2016 4:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

నయనతార చిత్రంలో విజయ్‌సేతుపతి?

నయనతార చిత్రంలో విజయ్‌సేతుపతి?

విజయ్‌సేతుపతి, నయనతారలది హిట్ ఫెయిర్ అన్న విషయం తెలిసిందే. నానుమ్ రౌగీదాన్ చిత్రంలో వీరిద్దరూ తొలిసారిగా కలిసి నటించారు. నిజం చెప్పాలంటే ఆ చిత్రంతోనే విజయ్‌సేతుపతి కమర్శియల్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం కవన్. ఇందులో మడోనా సెబాస్టియన్ నాయకిగా నటిస్తున్నారు. టీ.రాజేందర్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కేవీ.ఆనంద్ దర్శకుడు.చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ సంగతి అటుంచితే నయనతార నటిస్తున్న తాజా చిత్రం ఇమైక్కా నోడిగళ్. ఇందులో యువ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్నారు.

ఆయనకు జంటగా నటి రాశీఖన్నా నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తూ కోలీవుడ్‌కు పరిచయం అవుతుండటం విశేషం. కాగా ఇందులో మురో కీలక పాత్రకు నటుడు విజయ్‌సేతుపతిని ఎంపిక చేసినట్లు సమాచారం. క్యామియో ఫింలిస్ పతాకంపై సీ.జయకుమార్ నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అరుున ఈ చిత్రానికి సంగీతాన్ని హిప్ హాప్ తమిళా, ఆర్‌డీ.రాజశేఖర్ ఛాయాగ్రాహణం, మాటల్ని పట్టుకోట ప్రభాకర్ అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement