ఆ ఇద్దరి కాంబినేషన్‌లో విక్రమ్ వేదా | vikramveda is Combination of the two | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో విక్రమ్ వేదా

Published Thu, Nov 17 2016 4:14 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో విక్రమ్ వేదా

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో విక్రమ్ వేదా

సెలక్టెడ్ చిత్రాలనే చేసే నటుడు మాధవన్, వైవిధ్యభరిత చిత్రాల నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌సేతుపతి కలిసి ఒక చిత్రంలో నటిస్తే ఆ చిత్రం కచ్చితంగా విభిన్నంగా ఉంటుందనడంలో సందేహం ఉండదు. సరిగ్గా అలాంటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్.మాధవన్, విజయ్‌సేతుపతి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి విక్రమ్ వేదా అనే టైటిల్‌ను నిర్ణరుుంచారు. ఇందులో క్రిమీ చిత్రం ఫేమ్ కదిర్, నటి వరలక్ష్మి, యూటర్న్ చిత్రం ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్, ష్రేమ్, అచ్యుత్‌కుమార్, హరీష్‌వర్మ, వివేక్ ప్రసన్న ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇంతకుముందు తమిళ్‌పడమ్, కాదలిల్‌సొదప్పువదు ఎప్పడి,వాయైమూడి పేసవుమ్, ఇరుదు చుట్రు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వైనాట్ స్టూడియోస్ శశికాంత్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. దీనికి దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు. మాటలను మణికంఠన్, సంగీతాన్ని సీఎస్.శ్యామ్, ఛాయాగ్రహణం పిఎస్.వినోద్ అందిస్తున్నారు. టైడెంట్ ఆర్ట్స్ ఆర్.రవీంద్రన్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. విక్రమ్ వేదా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement