విజయ్‌సేతుపతితో బాక్సింగ్ బ్యూటీ | Irudhi Suttru Fame Ritika's Next Round With Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతితో బాక్సింగ్ బ్యూటీ

Published Mon, Feb 29 2016 2:21 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

విజయ్‌సేతుపతితో బాక్సింగ్ బ్యూటీ - Sakshi

విజయ్‌సేతుపతితో బాక్సింగ్ బ్యూటీ

ఒక విజయం జాతకాన్నే మార్చేస్తుంది. దానికోసం కొందరు పెద్ద తపమే చేయాల్సి ఉంటుంది. మరికొందరికి అనాయాసంగా వరించేస్తుంది. అలా ఒక్క చిత్రంతోనే విజ యాన్ని అందుకున్న నటి రితిక సింగ్. బాక్సింగ్ క్రీడా రంగంలో ఎదుగుతున్న ఢిల్లీ బ్యూటీ రితిక సింగ్. సినిమా పక్కకే పోవద్దనుకున్న ఈ భామ అనూహ్యంగా ఇరుదు చుట్రు అనే ద్విభాషా(హిందీలో ఖదూస్)చిత్రంలో నటించింది.
 
 అందులో తన రియల్ లైఫ్ పాత్రనే పోషించిన రితిక సింగ్‌కు ఆ చిత్రం విపరీతమైన క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. దీంతో మంచి పాత్రలు అనిపిస్తే ఇకపై కూడా నటిస్తానని ఈ అమ్మడు విలేకరుల సమావేశంలో వెల్లడించడంతో పలు అవకాశాలు ఆమె గుమ్మం తలుపులు తడుతున్నాయి. అయితే రితిక ఇప్పుడు కాక్కా ముట్టై చిత్ర దర్శకుడు తాజా చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపింది. కాక్కాముట్టై చిత్రంతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న మణికంఠన్ ఇప్పుడు ఆండవన్ కట్టళై చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
 
 ఇందులో విజయసేతుపతి హీరోగా నటించనున్నారు. ఈయనకు జంటగా రితికసింగ్ నటించనున్నారు. దీనికి క్రిమి చిత్ర దర్శకుడు అనుచరణ్ ఛాయాగ్రహణను అందించనుండటం విశేషం. కే సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రం మార్చి 7న ప్రారంభం కానుంది. ఇది ఫీల్ గుడ్ ఫిల్మ్‌గా ఉంటుందంటున్నారు దర్శకుడు మణికంఠన్. కాగా ప్రస్తుతం ధర్మదురై చిత్రంలో నటిస్తున్న విజయసేతుపతి తదుపరి నటిచనున్న చిత్రం ఇదే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement