స్వీయ రక్షణే స్వైన్‌ఫ్లూ నివారణ మంత్రం
Published Mon, Feb 6 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM
కర్నూలు(హాస్పిటల్):
స్వీయ రక్షణ చర్యలే స్వైన్‌ఫ్లూ నివారణ మంత్రమని జనరల్ పిజీషియన్ డాక్టర్ భవానీప్రసాద్ చెప్పారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక ఎ.క్యాంపులోని హెల్త్ క్లబ్‌లో స్వైన్‌ఫ్లూ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సు పోస్ట్‌మాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్ ప్రారంభించారు. అనంతరం డాక్టర్ భవానీప్రసాద్ మాట్లాడుతూ చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆసుపత్రులకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి అధికంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిలు, హెచ్‌ఐవీ, టీబీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారికి వస్తుందని, వీరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని, వ్యాధి తగ్గే వరకు బయట తిరగకపోవడమే మేలన్నారు. కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణచక్రవర్తి, ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి. చంద్రశేఖర్, సభ్యులు చంద్రశేఖర కల్కూర, ఐ.విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement