వాషింగ్టన్: అన్ని రకాల ఫ్లూ వైరస్‌లను నిరోధించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త యాంటీ బయాటిక్‌ను కనుగొన్నారు. దాని పేరు 1జీ01. 2017లో ఫ్లూ జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఒక రోగి శరీరంలో దీనిని గుర్తించారు. ఎలుకలపై పరిశోధనలు నిర్వహించగా ఈ యాంటీ బయాటిక్ మనుషుల్లో సోకే ఫ్లూ వైరస్‌లు సహా 12 రకాల వైరస్‌లను నిరోధించింది. మొదట ఎలుకలకు ఫ్లూ వైరస్‌లు ఎక్కించి 3 రోజుల తర్వాత యాంటీ బయాటిక్ ఇవ్వగా అది సమర్థంగా పని చేసింది. తాజా పరిశోధనల దృష్ట్యా భవిష్యత్తులో అన్ని రకాల ఫ్లూ వైరస్‌లకు ఒకే మందు తయారు చేస్తామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment