టమాటో ఫ్లూపై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు | Centre Advisory To States Tomato Flu | Sakshi
Sakshi News home page

100కు చేరిన టమాటో ఫ్లూ కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

Published Wed, Aug 24 2022 9:33 PM | Last Updated on Wed, Aug 24 2022 9:39 PM

Centre Advisory To States Tomato Flu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో టమాటో ఫ్లూ వ్యాధి నాలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశాలో ఈ కేసులు వెలుగుచూశాయి. 100మందికిపైగా చిన్నారులు ఈ వ్యాధి బారినపడి ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. 

► హ్యాండ్, ఫుట్‌, మౌత్ డీసీజ్‌(హెచ్ఎఫ్‌ఎండీ) వ్యాధినే టమాటో ఫ్లూ అంటారు. ఇది 10 ఏళ్లలోపు చిన్నారులకు ఎక్కువగా వ్యాపిస్తుంది. పెద్దలకు కూడా వ్యాపించే అవకాశముంది.
► టమాటో ఫ్లూ వ్యాధి గురించి చిన్నారులకు అ‍వగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా వివరించాలని పేర్కొంది. 
► టమాటో ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌లలాగే ఉంటాయి. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో జ్వరం, అలసట, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. 
► టమాటో ఫ్లూకు కోవిడ్, మంకీపాక్స్, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదు. 
► అపరిశుభ్ర ఉపరితలాన్ని తాకడం, పండ్లు, వస్తువులను శుభ్రం చేయకుండా నేరుగా నోట్లో పెట్టుకోవడం వంటి కారణాలతో ఈ వ్యాధి సోకవచ్చు.
► టమాటో ఫ్లూ సోకిన, లక్షణాలు కన్పించిన చిన్నారులను ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. 
► జ్వరం, దద్దుర్లు ఉన్న చిన్నారులు ఇతరులను తాకడం, కౌగిలించుకోవడం చేయవద్దని తల్లిదండ్రులు చెప్పాలి
► నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లలకు దాన్ని మాన్పించాలి.
► ఎప్పుడూ వేడి నీటితోనే పిల్లలకు స్నానం చేయించాలి. పోషక పదార్థాలున్న ఆహారాన్నే ఇవ్వాలి. 
► పిల్లలకు విశ్రాంతి, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
చదవండి: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement