![106 year old Delhi man beats COVID-19 and spanish flu - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/6/ddd.jpg.webp?itok=5-p3MJ--)
న్యూఢిల్లీ: 106 సంవత్సరాల వృద్ధుడి అపూర్వమైన విజయగాథ ఇది. 1918లో నాలుగేళ్ల వయసులో స్పానిష్ ఫ్లూ బారినపడి కోలుకొని, మళ్లీ 102 ఏళ్ల తర్వాత 106 ఏళ్ల వయసులో కరోనా మహమ్మారిని జయించాడు. ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకొని, నెల రోజుల క్రితం రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన భార్య, కుమారుడు, కుటుంబంలోని మరో వ్యక్తి కంటే ఆయనే ముందుగా కోలుకున్నాడు. ఢిల్లీలో ఇలా రెండు మహమ్మారులను జయించిన వ్యక్తి బహుశా ఈయనొక్కడే కావొచ్చని అధికారులు తెలిపారు. వృద్ధుడి కుటుంబ సభ్యులు కూడా కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. 102 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూప్రపంచాన్ని వణికించింది. అప్పటి జనాభాలో మూడింట రెండొంతుల మంది ఈ వైరస్ బారినపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment