Rajiv Gandhi Hospital
-
Operation Kaveri: సూడాన్ నుంచి వచ్చిన వారిలో ఎల్లో ఫివర్
బనశంకరి: సూడాన్ నుంచి వెనక్కి వస్తున్న భారతీయులకు ప్రమాదకరమైన ఎల్లో ఫివర్ భయం పట్టుకుంది. సూడాన్ నుంచి ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఎల్లో ఫివర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. చర్మం, కళ్లు పచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు ఈ జ్వరం లక్షణాలు. పరిస్థితి విషమిస్తే 15 రోజుల్లో అంతర్గత రక్తస్రావం సంభవించి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. మరోవైపు, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా సూడాన్ నుంచి మరో 365 మంది భారతీయులను శనివారం తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఇప్పటి వరకు 1,725 మంది స్వదేశానికి తరలించినట్లయిందని పేర్కొన్నారు. -
చెన్నై రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
సాక్షి, చెన్నై: చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్పత్రిలోని ఐసీయూలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ టీం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన ఆసుపత్రిని మంత్రి సుబ్రమణ్యం, హెల్త్ సెక్రటరీ రాధాకృష్ణన్ సందర్శించారు. -
స్పానిష్ ఫ్లూ నుంచి కరోనా దాకా..
న్యూఢిల్లీ: 106 సంవత్సరాల వృద్ధుడి అపూర్వమైన విజయగాథ ఇది. 1918లో నాలుగేళ్ల వయసులో స్పానిష్ ఫ్లూ బారినపడి కోలుకొని, మళ్లీ 102 ఏళ్ల తర్వాత 106 ఏళ్ల వయసులో కరోనా మహమ్మారిని జయించాడు. ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకొని, నెల రోజుల క్రితం రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన భార్య, కుమారుడు, కుటుంబంలోని మరో వ్యక్తి కంటే ఆయనే ముందుగా కోలుకున్నాడు. ఢిల్లీలో ఇలా రెండు మహమ్మారులను జయించిన వ్యక్తి బహుశా ఈయనొక్కడే కావొచ్చని అధికారులు తెలిపారు. వృద్ధుడి కుటుంబ సభ్యులు కూడా కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. 102 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూప్రపంచాన్ని వణికించింది. అప్పటి జనాభాలో మూడింట రెండొంతుల మంది ఈ వైరస్ బారినపడ్డారు. -
జీతం కోసం జూడాల ఆందోళన
సాక్షి, చెన్నై : రెండు నెలల వేతనం కోసం జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో చెన్నై రాజీవ్ గాంధీ ఆస్పత్రి(జీహెచ్) వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చెన్నై జీహెచ్‌లో వందలాది మంది జూనియర్ డాక్టర్లు రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రతి రోజూ షిఫ్టు పద్ధతిలో వీరు విధులను నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే, రెండు నెలలుగా వీరికి జీతం మంజూరు కాలేదు. హాస్టళ్లలో సౌకర్యాలు శూన్యం కావడంతో ఆందోళనకు జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. శనివారం ఉదయాన్నే విధులకు హాజరైన జూనియర్ డాక్టర్లు అందరూ ఆందోళనబాట పట్టారు. వైద్య సేవలను పక్కన పెట్టి, ఆస్పత్రి ఆవరణలో బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. రెండు నెలలుగా బకాయి ఉన్న జీతాన్ని మంజూ రు చేయాలని, వార్డెన్‌ను మార్చాలని, హాస్టల్లో సౌకర్యా లు, వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. గంట పాటుగా వైద్య సేవలకు ఆటంకం నెలకొనడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. జూనియర్ డాక్టర్లను బుజ్జగించే యత్నం చేశారు. పక్క రాష్ట్రాల్లో యూజీ వైద్యులకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు జీతాలు ఇస్తున్నారని ఆందోళనకారులు పేర్కొన్నారు. అయితే, తమకు కేవలం రూ.14,400 జీతం ఇస్తున్నారని, దీన్ని కూడా రెండు నెలలు బకాయి పెట్టడం ఎంత వరకు సమంజసమని అధికారులను నిలదీశారు. హాస్టల్లో వార్డెన్ తీరును ఎత్తి చూపుతూ, ఆయన్ను మార్చాలని, తమకు మెరుగైన వసతులు కల్పిం చాలని ఒత్తిడి తెచ్చారు. చివరకు అధికారులు కొన్ని హామీ లు ఇచ్చి ఆందోళన విరమింప చేశారు. పది రోజుల్లో బకా యి వేతనం మంజూరు, హాస్టల్లో సౌకర్యాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీతం పెంపు విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖతో చర్చించినానంతరం నిర్ణయం తీసుకోవా లని దాట వేశారు. ఈ ఆందోళన పుణ్యమా అంటూ గంట పాటుగా రోగులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.