సాక్షి, చెన్నై : రెండు నెలల వేతనం కోసం జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో చెన్నై రాజీవ్ గాంధీ ఆస్పత్రి(జీహెచ్) వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చెన్నై జీహెచ్‌లో వందలాది మంది జూనియర్ డాక్టర్లు రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రతి రోజూ షిఫ్టు పద్ధతిలో వీరు విధులను నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే, రెండు నెలలుగా వీరికి జీతం మంజూరు కాలేదు. హాస్టళ్లలో సౌకర్యాలు శూన్యం కావడంతో ఆందోళనకు జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. శనివారం ఉదయాన్నే విధులకు హాజరైన జూనియర్ డాక్టర్లు అందరూ ఆందోళనబాట పట్టారు. వైద్య సేవలను పక్కన పెట్టి, ఆస్పత్రి ఆవరణలో బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. రెండు నెలలుగా బకాయి ఉన్న జీతాన్ని మంజూ రు చేయాలని, వార్డెన్‌ను మార్చాలని, హాస్టల్‌లో సౌకర్యా లు, వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.
గంట పాటుగా వైద్య సేవలకు ఆటంకం నెలకొనడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. జూనియర్ డాక్టర్లను బుజ్జగించే యత్నం చేశారు. పక్క రాష్ట్రాల్లో యూజీ వైద్యులకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు జీతాలు ఇస్తున్నారని ఆందోళనకారులు పేర్కొన్నారు. అయితే, తమకు కేవలం రూ.14,400 జీతం ఇస్తున్నారని, దీన్ని కూడా రెండు నెలలు బకాయి పెట్టడం ఎంత వరకు సమంజసమని అధికారులను నిలదీశారు. హాస్టల్లో వార్డెన్ తీరును ఎత్తి చూపుతూ, ఆయన్ను మార్చాలని, తమకు మెరుగైన వసతులు కల్పిం చాలని ఒత్తిడి తెచ్చారు. చివరకు అధికారులు కొన్ని హామీ లు ఇచ్చి ఆందోళన విరమింప చేశారు. పది రోజుల్లో బకా యి వేతనం మంజూరు, హాస్టల్లో సౌకర్యాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీతం పెంపు విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖతో చర్చించినానంతరం నిర్ణయం తీసుకోవా లని దాట వేశారు. ఈ ఆందోళన పుణ్యమా అంటూ గంట పాటుగా రోగులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
జీతం కోసం జూడాల ఆందోళన
Published Sat, May 10 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement
Advertisement