సాక్షి, చెన్నై: చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్పత్రిలోని ఐసీయూలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ఆస్పత్రిలో 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ టీం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన ఆసుపత్రిని మంత్రి సుబ్రమణ్యం, హెల్త్ సెక్రటరీ రాధాకృష్ణన్ సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment