
ఫెర్టిలైజర్‌సిటీ(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో 2021–22 సంవత్సరం 3,74,728.32 టన్ను ల యూరియా ఉత్పత్తి అయిందని ఆ కర్మాగారం సీజీఎం విజయ్‌కుమార్ బంగార్ మంగళవారం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కర్మాగారం వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించి ఏడాది పూర్తయింది.
దేశీయంగా ఎరువుల కొరత తీర్చడమే ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉద్దేశం. ఈ ప్లాంట్‌లో ప్రతిరోజూ 2,200 టన్నుల అమ్మో నియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. కర్మాగారం వాణిజ్య ఉత్పత్తుల్లో తెలంగాణకు 2,11,073.13, ఆంధ్రప్రదేశ్‌కు 1,00,321.11, కర్ణాటకకు 63,334.08 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఎరువుల కొరత తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన ఎరువుల కర్మాగారాలను కేంద్రం పునరుద్ధరించిందని, వాటిల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్ (నాటి ఎఫ్‌సీఐ) కూడా ఒకటని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment