నగరంలో రింగ్ రోడ్డు | Government to construct Rs 4700 cr ring road in Delhi: Nitin Gadkari | Sakshi
Sakshi News home page

నగరంలో రింగ్ రోడ్డు

Published Tue, Dec 2 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

Government to construct Rs 4700 cr ring road in Delhi: Nitin Gadkari

 న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నగరంలో త్వరలో ఓ రింగ్ రోడ్డును నిర్మించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభ సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్ నుంచి బయటికొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 4,700 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నామన్నారు. ‘నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ఈ సమస్య పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా రూ. 4,700 కోట్లతో రింగ్‌రోడ్డును నిర్మిస్తాం. ఇది పూర్తిగా సిమెంట్ కాంక్రీట్‌తో నిర్మితమవుతుంది. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించాం. ఈ నెల 11వ తేదీతో దీని గడువు ముగుస్తుంది’ అని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేస్తారన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ సరిహద్దులుగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాలుపంచుకుంటాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement