విజయవాడ : విభిన్న తరహా దొంగతనాలకు పాల్పడే ఇద్దరు అంతర్ జిల్లాల నేరస్తులను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద మోటారు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులిద్దరు నగరంలో పలు నేరాలకు పాల్పడినట్లు తేలింది. నిందితులు విజయవాడ వించిపేటకు చెందిన షేక్ ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్, షేక్ నిజాముద్దీన్‌లుగా గుర్తించారు.
వీరు జైలు నుంచి బయటకు వచ్చాక విజయవాడ నగరంలోని గవర్నర్‌పేట, పటమట, భవానీపురం, కృష్ణలంక, లబ్బీపేట ఏరియాలలో పలు నేరాల కు పాల్పడ్డారు. వారిని అరెస్టు చేసి రూ. 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, టీవీ, రెండు బైక్‌లు, ఓ కెమేరాను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. నిందితులు గతంలో విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుంటూరులో పలు నేరాలకు పాల్పడ్డారు. నిందితులపై చోరీలు, లైంగికదాడి కేసు కూడా ఉంది.
అంతర్ జిల్లాల నేరస్తులు అరెస్ట్
Published Wed, May 31 2017 7:01 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement