సమైక్యతతోనే రాష్ట్ర ప్రగతి | State development possible only with united andhra | Sakshi
Sakshi News home page

సమైక్యతతోనే రాష్ట్ర ప్రగతి

Published Tue, Aug 13 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

State development possible only with united andhra

అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో ప్రగతి అభివృద్ధి సాధ్యమవుతుందని వర్తక సంఘం గౌరవ కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణరావు (పెదబాబు) అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అనకాపల్లి వర్తక సంఘం అనుబంధ సంస్థలు, ఎన్టీఆర్ మా ర్కెట్‌యార్డుకు చెందిన వర్తకులు, కొలగార్లు సోమవారం భారీ ర్యాలీ, నెహ్రూచౌక్ వద్ద మానవహారం నిర్వహించారు.

మార్కెట్‌యార్డు నుంచి రింగ్‌రోడ్డు, మెయిన్‌రోడ్డు మీదుగా వర్తక సంఘం అనుబంధ సంస్థలైన ఏఎంఏఎల్ కళాశాల, ఏఎమ్‌ఏఏ హైస్కూల్, ఘోషాస్పత్రి, ఏఎమ్‌ఏ ఎలిమెంటరీ పాఠశాల, ఆస్క్ కళాశాలల నుంచి అధ్యాపక, ఉపాధ్యాయ బృందం, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మార్కెట్‌యార్డు వర్తకులు, కార్మికులు, కళాసీలు, కొలగార్లు భారీ సంఖ్య లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూచౌక్ వద్ద మానవహారంగా ఏర్పడిన వర్తకులు, విద్యార్థులనుద్దేశించి పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వందలాది పరిశ్రమల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల యువత ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు.

ఈ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు. ర్యాలీలో గాంధీ, నెహ్రూ, పొట్టి శ్రీరాములు, ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భారతమాత, తాండ్ర పాపారాయుడు తదితర స్వాతంత్య్ర సమరయోథులు, దేశభక్తుల వేషధారులు విశేషంగా ఆకట్టుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement