రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం నగరానికి రింగు రోడ్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు.
అనంతపురం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం నగరానికి రింగు రోడ్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రింగు రోడ్డు కోసం తొలి విడతగా రూ.129 కోట్లు విడుదల చేశారని తెలిపారు.
ఇప్పటికే రూ.150 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థపై దష్టి పెట్టామని, త్వరలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు.