అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్రోడ్డు | 185 kilometers of ring road around amaravathi capital region | Sakshi
Sakshi News home page

అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్రోడ్డు

Published Mon, Sep 28 2015 2:01 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్రోడ్డు - Sakshi

అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్రోడ్డు

అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 800 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. కర్నూలు మీదుగా అనంతపురం, అమరావతిని కలుపుతూ ఎన్హెచ్ 44- ఎన్హెచ్ 65తో అనుసంధానించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

కర్నూలు, కడప, అనంతపురాలను కలుపుతూ ఎన్హెచ్ 40, ఎన్హెచ్ 60లను అనుసంధానించనున్నారు. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న రహదారులను 6, 8 లేన్ల జాతీయ రహదారులుగా మారుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తిచేస్తే పనులు వెంటనే ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement