ఉత్తరప్రదేశ్ కూలీ దుర్మరణం
Published Sat, Oct 29 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
కర్నూలు: కర్నూలు శివారులోని డోన్ రహదారిలో రింగు రోడ్డు నిర్మాణ పనుల్లో క్రేన్ తగిలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉస్మాన్‌పూర్‌కు చెందిన కూలీ అమర్‌నాథ్ (23) అక్కడికక్కడే మృతిచెందాడు. శనివారం ఉదయం లారీలో నుంచి హైడ్రో క్రేన్ ద్వారా సిమెంటు దిమ్మెలు దింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సిమెంటు దిమ్మెకు నాలుగు వైపులా గొలుసు తగిలించి క్రేన్ ద్వారా దిమ్మెలను కిందికి దించాల్సి ఉంది. అయితే ఓ వైపు గొలుసు తగిలించకముందే క్రేన్ డ్రైవర్ జితేంద్ర కుమార్ చూసుకోకుండా నిర్లక్ష్యంగా క్రేన్‌ను ముందుకు నడపడంతో అమర్‌నాథ్‌కు సిమెంటు దిమ్మె తగిలి మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే తాలూకా పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సొంత గ్రామం ఉస్మాన్‌పూర్‌కు తరలించారు.
Advertisement
Advertisement