coole
-
కాటేసిన కరెంట్..
విద్యుదాఘాతంతో కౌలురైతు మృతి – మరో ఇద్దరు కూలీలకు గాయాలు – పరిస్ధితి విషమం - అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్న రైతులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఓ విద్యుత్ స్తంభం కూలి పొలంలో తీగలు అడ్డంగా పడ్డాయి. దీనిపై రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు వాటిని సరిచేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఓ రైతు కూలీలతో కలసి విద్యుత్ తీగలను తొలగిస్తుండగా ప్రమాదం జరిగింది. చిన్నబోధనం(చాగలమర్రి): చిన్నబోధనంలో విద్యుదాఘాతంతో ఓ కౌలు రైతు మృతి చెందాడు. మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాయ్యాయి. బాధితుల కథనం మేరకు.. పెద్దబోధనం గ్రామానికి చెందిన రైతు నారాయణ((35) అదే గ్రామానికి చెందిన పద్మనాభశెట్టి అనే రైతు వద్ద 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసేవాడు. బుధవారం ఉదయం పెద్దబోధనం గ్రామానికి చెందిన కూలీలు ఏసన్న, చాకలి సంజీవతో కలసి చిన్నబోధనంలోని కౌలు పొలంలో సేద్యపు పనులు చేసేందుకు వెళ్లారు. అయితే పొలంలో విద్యుత్ తీగలు తెగిపడి ఉండడంతో ట్రాన్స్ఫార్మర్ ఫీజులు వాటిని చుట్ట చేసి పక్కన పెట్టేందుకు యత్నించారు. ఈక్రమంలో విద్యుత్ స్తంభంపై ఉన్న మరోలైన్కు వీరు పట్టుకున్న తీగ తగిలింది. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో కౌలు రైతు నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏసన్న, చాకలి సంజీవలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పక్క పొలంలోని రైతులు 108 కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. సంజీవ పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారు. కౌలు రైతు నారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పది రోజుల కిందట వర్షాలకు విద్యుత్ స్తంభం నేలకొరగడంతో విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చామని, కేవలం ఒక విద్యుత్‌లైన్‌ను తొలగించారని, స్తంభాన్ని పునరుద్ధరించడంగాని, పొలాల్లో అడ్డంగా పడి ఉన్న విద్యుత్ తీగలను తొలగించడం గాని చేయలేదన్నారు. దీంతో రైతు పంట సాగుకు అడ్డుగా ఉండడంతో వాటిని తొలగించే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
మంచంపైకి దూసుకెళ్లిన కారు
- ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం పెంచికలపాడు (గూడూరు రూరల్): ఉపాధి పనులకు వెళ్లి వచ్చి..ఇంటి ముందు మంచం వేసుకొని సేదతీరుతున్న తండ్రి, కొడుకుపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి మృతి చెందంగా కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. గూడూరు మండలం పెంచికలపాడులో బుధవారం.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కర్నూలు రోడ్డు పక్కన నివాసం ఉంటున్న చిన్న నాగన్న రోజు వారీగా ఉదయం కొడుకు తిరుమలేష్‌తో కలిసి ఉపాధి పనులకుÐð వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఎండ వేడిమికి తాళలేక ఇంటి ముందు మంచం వేసుకుని చిన్న నాగన్న (66), కుమారుడు తిరుమలేష్(35) సేదతీరుతున్నారు. అయితే కర్నూలు నుంచి కోడుమూరు వైపు అతి వేగంగా వస్తున్న ఏపీ 21 జెడ్ 0005 నెంబర్ గల మారుతి స్విఫ్ట్ కారు అదుపు తప్పి రోడ్డు పై నుంచి కిందకు దిగి మంచంపై కూర్చున్న చిన్న నాగన్న, తిరుమలేష్‌ను ఢీ కొట్టి ఇంటిలోకి దూసుకెళ్ళింది. ప్రమాదంలో చిన్న నాగన్న అక్కడికక్కడే మృతి చెందగా, తిరుమలేష్‌కు తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న కె.నాగలాపురం ఎస్ఐ మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారు డ్రైవర్ అతి వేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, తీవ్రంగా గాయపడిన తిరుమలేష్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టినట్లు ఎస్ఐ చెప్పారు. -
వడదెబ్బతో ఉపాధి కూలీమృతి
దొర్నిపాడు: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన గురువారం కొండాపురంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన షేక్‌మహబూబ్‌బాషా (47) బుధవారం కొండాపురం–భాగ్యనగరం గ్రామాల మధ్యలో జరుగుతున్న పంట కాల్వల్లో పూడికతీత పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫీల్డ్ అసిస్టెంట్ బషీర్ కూలీల సాయంతో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేటు వాహనంలో తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. పంచాయతీ కార్యదర్శి సులోచన, ఏపీఓ పిడుగు రాముడు గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుని బంధువులు, కుటుంబసభ్యులు కోరారు. -
కాటేసిన మృత్యువు
- వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం - అంకిరెడ్డిపల్లె వద్ద ఆటో బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృత్యువాత - హళేబీటు వద్ద లారీ ఢీకొని ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృతి - రెండు ప్రమాదాలకు అతివేగమే కారణం బతుకుబాటలో మృత్యుఒడి కొలిమిగుండ్ల: పొట్టకూటి కోసం తెల్లారకముందే బతుకుబాట పట్టిన ముగ్గురు మహిళా కూలీలు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి బలయ్యారు. అంకిరెడ్డిపల్లెకు చెందిన మహిళా కూలీలు నెల రోజుల నుంచి అవుకు మండలం కాశీపురం గ్రామంలో మిరప పంట కోతకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామునే 40 మంది మహిళలు ట్రాలీ ఆటోలో బయలు దేరారు. ఆటో పైన చెక్క పలకలు వేసిన డ్రైవర్ ట్రాలీలో కొంత మందిని, పలకలపైన మరి కొంత మందిని ఎక్కించారు. ఓవర్ లోడుతో ఊరు నుంచి రెండు కి.మీ దాటగానే ప్రధాన రహదారిపై కనకాద్రిపల్లె–అంకిరెడ్డిపల్లె గ్రామాల మధ్యన ఆటో బోల్తా పడింది. ఇంకా పొద్దు పొడవక పోవడంతో మసక చీకటల్లో ఏమి జరిగిందో తెలియక మహిళలు కేకలు వేశారు. సంఘటన స్థలంలోనే అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన యర్రగుడి చెన్నమ్మ(50), పుచ్చల లక్ష్మీదేవి (46)అక్కడిక్కడే దుర్మరణం చెందారు. దూదేకుల కుళ్లాయమ్మ(55) తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడే అమె మృతి చెందింది. దూదేకుల ఫాతీమాకు తీవ్ర గాయాలై ప్రాణప్రాయ స్థితిలో అనంతపురంలోని ఓప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తులశమ్మతో పాటు మాజీ సర్పంచ్ భార్య తీవ్రంగా గాయపడ్డారు. వీరితో 30 మందికి పైగా మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. సాయం కోసం క్షతగాత్రులు హాహకారాలు చేశారు. కూలీలు వెంట తెచ్చుకున్న సద్ది కూడా కింద పడి రక్తసిక్తమైంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారి రోదనలు మిన్నంటాయి. అంబులెన్స్ సకాలంలో రాక పోవడంతో అంకిరెడ్డిపల్లెకు చెందిన పారిశ్రామిక వేత్త అన్నెం జయరామిరెడ్డి మానవతా దృక్పథంతో తన స్కార్పియో వాహనంలో గాయాల పాలైన మహిళలను తాడిపత్రికి తరలించారు. ఏఎస్ఐ ఉస్మాన్‌ఘని, కానిస్టేబుల్ మహేష్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాద వివరాలను సేకరించి మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉపాధి లేక వలస: ఊర్లో ఉపాధి పనులు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో జీవనోపాధి నిమిత్తం మహిళలు ఇతర మండలాలకు కూలీ పనులకు వలస వెళ్తున్నారు. అంకిరెడ్డిపల్లెలో మొక్కుబడిగా పనులు చేపట్టి మానేయడంతో చాలా మంది మహిళలు ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాపరాతి గనులు ఉన్నప్పటికీ చాలా మంది మహిళలు ప్రమాదకరమైన గని పని చేయలేక ఉపాధి పథకంలో జాబ్‌కార్డులు పొందినా ప్రయోజనం లేదు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
నందికొట్కూరు: కూలీకి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. నందికొట్కూరు పట్టణంలోని మద్దిగట్ల ప్రాంతానికి చెందిన నద్దీం(22) సోమవారం ఓ రైతు పొలంలో పొగాకు తోరణాలు కట్టేందుకు కూలీకి వెళ్లాడు. ఈ క్రమంలో కిందకు వేలాడుతున్న మెయిన్ లైన్ విద్యుత్ తీగలు తగలి విద్యుదాఘాతానికి గురూ అక్కడికక్కడే మృతి చెందాడు. వీఆర్వోలు మద్దిలేటి, వెంకటరమణ ప్రమాద వివరాలను మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుకున్నారు. -
పాము కాటుతో వలస కూలీ మృతి
కడమకుంట్ల (తుగ్గలి) : బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఓ మహిళా కూలీ పాముకాటుకు గురై మృతి చెందింది. మృతురాలు బావ ఎస్.బాషా తెలిపిన వివరాల మేరకు.. తుగ్గలి మండలం కడమకుంట్ల గ్రామానికి చెందిన రుఖియా (21) తన భర్త నబీరసూల్, రెండేళ్ల కూతురు పర్వీన్‌తో కలిసి ఈనెల 2వ తేదీన గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో మిరప కాయలు తెంచేందుకు వలస వెళ్లారు. అదే రోజు సాయంత్రం పనిలో నిమగ్నమై ఉండగా రుఖియా పాము కాటుకు గురైంది. గమనించిన తోటి కూలీలు చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. కోమాలో ఉన్న రుఖియా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం సాయంత్రం మృతి చెందింది. -
కూలీకి వెళ్లి మృత్యు ఒడికి..
గూడూరు: పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్లి ఆటో బోల్తా పడడంతో ఓ మహిళ మృత్యు ఒడి చేరింది. ఈ ఘటలో నలుగురు మహిళలు గాయపడ్డారు. మండలంలోని జూలకల్లు వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సి.బెళగల్ మండలం పొలకల్లు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు 20 మంది ఆటోలో గూడూరు మండలంలోని మునుగాల గ్రామానికి చెందిన హనుమంతు పొలంలో మిరప పండు తెంపడానికి వెళ్లారు. పని ముగిసిన తరువాత కూలీలంతా అదే ఆటోలో స్వగ్రామమైన పోలకల్లుకు బయలు దేరారు. జూలకల్లు సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఒకరిపై ఒకరు పడి గాయపడ్డారు. ఇందులో బోయ సోమలమ్మ (55) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా బోయ పార్వతమ్మ, బోయ అంజనమ్మ, బోయ నాగలక్ష్మిలకు తీవ్రగాయలకు గురయ్యారు. సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకుని గాయపడ్డ వారిని గూడూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
బతుకుబాటలో మృత్యుఒడి
- ఆటో– మినీ వ్యాన్ ఢీ – ఇద్దరు మహిళలు మృతి – మరో ఇద్దరిపరిస్థితి విషమ..11మందికి స్వల్పగాయాలు – మిరపపండు తెంచే పనికి వెళ్తుండగా ఘటన ఎమ్మిగనూరు, రూరల్: వారు దినసరి కూలీలు. పనిచేస్తే కానీ పూటగడవదు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం మిరపపండు తెంచే పనికి 15 మంది ఆటోలో బయలుదేరారు. ఎమి్మగనూరు పట్టణ సమీపంలోని కర్నూల్ రోడ్డు ఇటుకల బట్టీ సమీపంలో ఆటో–మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో రమిజాబీ(52), మహబూబ్‌బీ(45) అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతావారికి స్వల్పగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పట్ణణంలోని పెద్దకమేళ ప్రాంతానికి చెందిన కూలీలు ఎర్రకోట గ్రామం దగ్గర మిరప పండు తెంచేందుకు వెళ్తారు. ఆదివారం ఎర్రకోటకు చెందిన ఏపీ 21వై 3318 నంబర్ గల ఆటోలో పనికి బయలుదేరారు. ఎర్రకోట నుంచి ఏపీ 21వై 0975 నంబర్ గల మినీ వ్యాన్ ఎమ్మిగనూరుకు వస్తుంది. పట్టణంలోని ఇటుకల బట్టీ దగ్గర ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను తప్పించబోయి వ్యాన్ బాడీకి ఆటో తగిలి పల్టీ కొట్టింది. దీంతో ఆటో వెనుక కూర్చున్న రమిజాబీ(52) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మహబూబ్‌బీ, దిల్షాబీ, జహీరాలకు తీవ్ర గాయాలుకాగా మిగతా 11 మందికి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ కె.హరిప్రసాద్, సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నడుము విరిగిపోవడంతో మహబూబ్‌బీ(45)ని మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌కు తరలించారు. అయితే, కోలుకోలేక కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. దిల్షాబీ, జహిరాబీల పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎమ్మిగనూరు ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ బాలజీకుమార్ కర్నూలుకు తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పట్ణణ ఎస్ఐ కె.హరిప్రసాద్ విలేకరులకు తెలిపారు. శోకసంద్రంలో మృతుల కుటుంబసభ్యులు ప్రమాదంలో మృతిచెందిన రమిజాబీ, మహబూబ్‌బీ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రమిజాబీకి భర్త బడేసావు, ఇద్దరు కూతుళ్లు సంతానం. మహబూబ్బీకి భర్త వలి, ముగ్గురు ఆడప్లిలలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఓవర్‌లోడే ప్రమాదానికి కారణమా! ఆటో కెపాసిటీకి మించి డ్రైవర్ 15మందిని ఎక్కించుకుని వెళ్తుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇటుకలబట్టీ దగ్గర ఆటోను డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. -
నన్నూరులో యువతి ఆత్మహత్య
ఓర్వకల్లు (పాణ్యం): ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం నన్నూరు గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పింజరి పెద్దయ్య, మీరమ్మలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె రేష్మ అలియాస్ సలీమ (17) గ్రామంలోనే తొమ్మిదో తరగతి వరకు చదివింది. తండ్రి పెద్దయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో పిల్లల పోషణ తల్లిపై పడింది. ఈ క్రమంలో చదువు మానేసిన రేష్మ తల్లితోపాటు కూలీ పనులకు వెళ్లేది. అయితే సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొంది. ఇరుగు పొరుగు వారు పరిస్థితిని గమనించి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఎస్ఐ చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతామన్నారు. మృతికి గల కారణాలు దర్యాప్తులో వెల్లడి కానున్నట్లు తెలిపారు. -
కూలి నగదు రూపంలో ఇవ్వాలి
హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుల వినతి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సివిల్ సప్లై గోదాముల్లో పనిచేసే హమాలీలకు ఇచ్చే కూలిని.. నగదు రూపంలో చెల్లించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణ, గౌరవాధ్యక్షుడు బి.చంద్రుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం సివిల్ సప్లై డీఎం కృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..హమాలీ లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, దసరా పండుగ బోనస్‌ను రెండు వేలకు పెంచాలని, మిఠాలకు ఇచ్చే నగదును రూ.500 చెల్లించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో నాయకులు జి.సుబ్బయ్య, రామదాసు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా..మహిళ దుర్మరణం
- కూలి పనులకు వెళ్తుండగా ఘటన - 15 మందికి స్పల్ప గాయాలు మల్లికార్జునపల్లి(హాలహర్వి): ఆటో బోల్తా పడి ఒక మహిళ మృతిచెందగా, 15మందికి స్వల్ప గాయాలయ్యాయి. చింతకుంట గ్రామం నుంచి మల్లికార్జునపల్లికి కూలీ పనులకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చింతకుంట గ్రామానికి చెందిన ఉలిగమ్మ(45) వ్యవసాయ కూలీ. మంగళవారం తోటి కూలీలతో కలిసి (మొత్తం 16) పత్తి విడిపించడానికి ఏపీ21వై 6314 నంబర్ గల ఆటోలో శిరుగాపురం గ్రామానికి ఉదయం 8 గంటలకు బయలుదేరింది. అయితే, మార్గమధ్యలో మల్లికార్జున గ్రామసమీపంలో ప్రమాదవశాత్తు ఆటో ముందుచక్రం స్ప్రింగ్‌రాడ్ విరిగిపోయింది. దీంతో ఆటో పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఉలిగమ్మ ఛాతీపై ఆటో ట్రాలీ పడటంతో శ్వాస ఆడక ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా 15 మంది కూలీలకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హాలహర్వి ఎస్ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉలిగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త గాదిలింగప్ప, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విలేకరులకు చెప్పారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
రుద్రవరం: మండలంలోని ఎర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన రైతు గంగుల వెంకటేశ్వర రెడ్డి (38) విద్యుదాఘాతంతో శనివారం సాయంత్రం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. విద్యుత్ అధికారులు స్థంభాలు మంజూరు చేయడంతో వెంకటేశ్వరరెడ్డి.. గ్రామ సమీపంలోని సొంత పొలంలో కూలీల చేత వాటిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. విద్యుత్ స్థంభానికి 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో దానిని పట్టుకొని ఉన్న వెంకటేశ్వరరెడ్డి కేకవేసి అక్కడికి అక్కడనే మృతి చెందాడు.కూలీలు ముగ్గురు పరుగులు తీసి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వెంకటేశ్వర రెడ్డి 15 రోజుల నుంచి అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. దీక్షలో ఉన్న రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయనకు భార్య సరిత, కుమారులు శరత్ చంద్రారెడ్డి, రాఘవేంద్రారెడ్డిలు ఉన్నారు. సరిత.. రుద్రవరం ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హనుమంతయ్య ఎర్రగుడిదిన్నె గ్రామం చేరుకొని ప్రమాదం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. -
కూలీలకు నల్లకుబేరుల ఎర
ఆత్మకూరు రూరల్: పనులు లేక ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ కూలీలకు నల్లకుబేరులు పని కల్పిస్తున్నారు. నోట్ల మార్పిడికి ఎర వేస్తూ కమీషన్ ఇస్తున్నారు. ఆత్మకూరు మండలంలో ఓ గ్రామానికి చెందిని కొందరి కూలీలను ఎంపిక చేసుకుని ఒక్కొక్కరికి భోజన సౌకర్యం, చార్జీలు ఇస్తూ కూలి కింద రూ. 500 ఇస్తున్నారు. వీరంతా ఉదయాన్నే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు చేతపట్టుకుని నల్లకుబేరులు ఇచ్చే పెద్ద నోట్లు తీసుకుని కర్నూలుకు వెళ్తారు. అక్కడ నోట్లు మార్చుకుని తిరిగి వస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నా, వేర్వేరు బ్యాంకుల వద్ద క్యూలో నిలిచి నోట్లు మారుస్తున్నారు. ఇలా నల్ల కుబేరులు దర్జాగా కూలీలను ఉపయోగించి బ్లాక్ సొమ్మును వైట్‌గా మార్చుతున్నారు. బ్యాంకులో బ్లాక్ అండ్ వైట్ దందా పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య జనాలను ధైర్యం కలిగించాల్సిన బ్యాంకు అధికారుల్లో కొందరు కమీషన్ల కక్కుర్తికి పాల్పడి నల్లకుబేరులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రముఖ బ్యాంకు మేనేజరు 10 శాతం కమీషన్‌తో నోట్లను మార్చుతున్నట్లు తెలుస్తోంది. రోజు క్యూలో నిలబడి తమ ఆధార్‌ను, డిక్లరేషన్‌ను సమర్పించి బ్యాంకులో నోట్లు మార్చుకుంటున్న సామాన్యుల ఆధార్ కార్డులను తిరిగి జిరాక్స్ చేయించి వాటిని ఆధారంగా బ్యాంకు అధికారి నోట్ల మార్పిడికి తెగిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణానికి చెందిన ఓ బడా బాబుకు ఒకే రోజు రూ. 2లక్షల పెద్ద నోట్లకు మార్పిడి నోట్లు ఇచ్చినట్లు సమాచారం. -
ఉత్తరప్రదేశ్ కూలీ దుర్మరణం
కర్నూలు: కర్నూలు శివారులోని డోన్ రహదారిలో రింగు రోడ్డు నిర్మాణ పనుల్లో క్రేన్ తగిలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉస్మాన్‌పూర్‌కు చెందిన కూలీ అమర్నాథ్ (23) అక్కడికక్కడే మృతిచెందాడు. శనివారం ఉదయం లారీలో నుంచి హైడ్రో క్రేన్ ద్వారా సిమెంటు దిమ్మెలు దింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సిమెంటు దిమ్మెకు నాలుగు వైపులా గొలుసు తగిలించి క్రేన్ ద్వారా దిమ్మెలను కిందికి దించాల్సి ఉంది. అయితే ఓ వైపు గొలుసు తగిలించకముందే క్రేన్ డ్రైవర్ జితేంద్ర కుమార్ చూసుకోకుండా నిర్లక్ష్యంగా క్రేన్‌ను ముందుకు నడపడంతో అమర్నాథ్కు సిమెంటు దిమ్మె తగిలి మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే తాలూకా పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సొంత గ్రామం ఉస్మాన్‌పూర్‌కు తరలించారు.