విద్యుదాఘాతంతో యువకుడి మృతి
Published Mon, Feb 27 2017 11:06 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
నందికొట్కూరు: కూలీకి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. నందికొట్కూరు పట్టణంలోని మద్దిగట్ల ప్రాంతానికి చెందిన నద్దీం(22) సోమవారం ఓ రైతు పొలంలో పొగాకు తోరణాలు కట్టేందుకు కూలీకి వెళ్లాడు. ఈ క్రమంలో కిందకు వేలాడుతున్న మెయిన్ లైన్ విద్యుత్ తీగలు తగలి విద్యుదాఘాతానికి గురూ అక్కడికక్కడే మృతి చెందాడు. వీఆర్వోలు మద్దిలేటి, వెంకటరమణ ప్రమాద వివరాలను మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుకున్నారు.
Advertisement
Advertisement