సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్‌ఎస్.. తాజాగా హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కోకాపేటలో నిర్మించినున్న భారత్ భవన్‌కు సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ భవన్‌కు సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హెచ్‌ఆర్డీగా పేరు పెట్టారు. కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో, మొత్తం 15 అంతస్థుల్లో భారత్ భవన్ నిర్మాణం జరగనుంది. ఈ కార్యాలయంలో అతి పెద్ద డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కార్యకర్తలకు అవగాహణ కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించేలా భవన నిర్మాణం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment