laid foundation
-
సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి.. అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
సాక్షి నాగర్ కర్నూలు: కొండాపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయితీ కార్యాలయం, గ్రంథాలయం, పశువైద్యశాల, బీసీ కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించారు. నాలుగు వరుసల బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మిల్క్ బల్క్ కూలింగ్ సెంటర్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.కాగా, సీఎం రేవంత్‌రెడ్డి గత 20 ఏళ్లుగా దసరా పండుగ రోజు స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో గ్రామస్తులతో కలిసి జమ్మికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి వేడుకలకు ముఖ్యమంత్రి హోదాలో రావడం విశేషం. సీఎం సొంత ఇంటి నుంచి జమ్మి చెట్టు వరకు రోడ్డును ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ లైట్లను అమర్చారు. -
సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం: భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు చెందాలని తమ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను తీసుకువచ్చిందన్నారు. గత దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామని చెప్పారు. సంపదను సృష్టించి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్థికంగా ఎదగడానికి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించామన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబోతున్న మీ సేవ సెంటర్ల నిర్వహణ కూడా మహిళలకు అప్ప చెప్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన కొరకై తమ ప్రభుత్వం మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు.ఆసుపత్రి ప్రారంభం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనహైద్రాబాద్ ప్రజాభవన్ నుంచి ఉదయం 7గంటలకు రోడ్డు మార్గాన ఖమ్మంకు చేరుకున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా అధికార యంత్రాగం, పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ఆర్సీఎం చర్చ్ ఎదురుగా స్థంబాద్రి హస్పిటల్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి మూడవ అంతస్తులో క్యాత్ ల్యాబ్‌ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఆక్కడి నుంచి చింతకాని మండలం గాంధినగర్ కు చేరుకొని రూ.175లక్షలతో గాంధినగర్ నుంచి బొప్పారం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తరువాత మధిర మండలం వంగవీడు గ్రామానికి చేరుకొని రూ. 30 కోట్లతో బోనకల్లు- అల్లపాడు- వంగవీడు గ్రామాల వరకు బిటి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. చిలుకూరు గ్రామాంలోని శివాలయం వద్ద రూ.70 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు, రూ.285 లక్షలతో చిలుకూరు నుంచి దొడ్డదేవరపాడు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మధిర మండలం మర్లపాడు గ్రామానికి చేరుకొని. రూ.275 లక్షలతో మర్లపాడు నుంచి పెనుగొలను-సిద్దినేని గూడెం వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్తాపన చేశారు. ఆ తరువాత మాటూరు గ్రామానికి చేరుకొని రూ.500 లక్షలతో మాటూరు నుంచి ముస్లీం కాలనీ బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆనంతరం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దారి పొడవున ఆయా గ్రామాల ప్రజలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు ఘనంగా స్వాగతం పలికారు. -
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
-
ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
-
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్.. తాజాగా హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కోకాపేటలో నిర్మించినున్న భారత్ భవన్‌కు సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ భవన్‌కు సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా పేరు పెట్టారు. కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో, మొత్తం 15 అంతస్థుల్లో భారత్ భవన్ నిర్మాణం జరగనుంది. ఈ కార్యాలయంలో అతి పెద్ద డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కార్యకర్తలకు అవగాహణ కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించేలా భవన నిర్మాణం జరగనుంది. చదవండి: నాన్న లే.. బుజ్జగించ నాన్న లేడు.. లాలించగ అమ్మ రాదు -
విశాఖలో ఐటీ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు
-
చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
-
భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
-
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
-
కొండవలస ప్రాంతాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన
-
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
నల్లకుంట: నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో అన్ని డివిజన్లలోని బస్తీలు, కాలనీలకు సమాన ప్రాధాన్యతది ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులతో అన్ని డివిజన్ల పరిధిలోనూ నూతన సీవరేజీ, డ్రైనేజీ పైప్‌లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. బుధవారం నల్లకుంట డివిజన్ యాక్సిస్ బ్యాంక్ లేన్‌లో రూ.6 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ అమృతతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా ప్రాంతాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్, భాస్కర్ గౌడ్, ప్రవీణ్, సాయికిరణ్, బీజేపీ నాయకులు శ్యామ్‌రాజ్, లక్ష్మణ్‌కుమార్, సుధాకర్ పాల్గొన్నారు. రోడ్ల సమగ్రాభివృద్ధికి కృషి.. అంబర్‌పేట: నియోజకవర్గంలో రోడ్ల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. బుధవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్ శ్రీనివాసకాలనీలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిరి్మంచనున్న సీసీ రోడ్లను స్థానిక కార్పొరేటర్ బీ.పద్మావెంకట్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లను సైతం ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ గద్వాల జిల్లా ఇన్చార్జ్ బీ.వెంకట్‌రెడ్డి, స్థానిక బీజేపీ, టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
-
మహానగరం ఇక విశ్వనగరం: కేటీఆర్
హైదరాబాద్: మహానగరం మణిహారాలసమాహారంగా రూపుదాల్చుతోంది. ట్రా‘ఫికర్’ లేకుండా ఇప్పటికే నిర్మించిన ఫ్లైఓవర్లకు మరో రెండు ఫ్లై ఓవర్లు తోడుకానున్నాయి. ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు నిర్మించబోయే స్టీల్ బ్రిడ్జిని, రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు మరో బ్రిడ్జిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌లతో కలసి మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఇందిరాపార్కు వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మహానగరంగా కీర్తిగాంచిన హైదరాబాద్ విశ్వనగరంగా పురుడుపోసుకుంటోందని అన్నారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు స్టీల్‌బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ దీర్ఘకాలికంగా ఉందని, అది తమ ప్రభుత్వ హయాంలో నెరవేరుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రూ.426 కోట్ల ఎస్ఆర్డీపీ నిధులతో చేపట్టిన రెండు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేసుకున్నామని, ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.350 కోట్లతో 2.6 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జి, రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు రూ.76 కోట్ల వ్యయంతో 900 మీటర్ల బ్రిడ్జి అందుబాటులోకి రానుం దని చెప్పారు. నగరంలో మరో రూ.6 వేల కోట్ల ఎస్ఆర్డీపీ నిధులతో పనులు నడుస్తున్నాయన్నారు. లాక్డౌన్ సమయంలో దాదాపు నాలుగురెట్ల వేగంతో కోట్లాది రూపాయల నిర్మాణపనులు పూర్తి చేశామని వివరించారు. హైదరాబాద్ రహదారులపై రద్దీ తగ్గాలనే ఉద్దేశంతో ఎస్ఆర్డీపీ, హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కొత్త లింక్ రోడ్లు, మిస్సింగ్ రోడ్లు నిర్మించుకుంటూ ముందుకుపోతున్నామని వివరించారు. నిర్వహణ పటిష్టంగా ఉండాలని 710 కిలోమీటర్ల ముఖ్యమైన రోడ్లను సీఆర్ఎంపీ పేరిట ప్రైవేటు సంస్థలకు అప్పగించామని చెప్పారు. భవిష్యత్‌లో రక్షణ రంగం స్థలాల అవసరం ఉంటుందని, నాగపూర్, రామగుం డం హైవేలపై సైతం 18 కిలోమీటర్ల మేర స్కైవేలు నిర్మించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరిశీలిస్తోందని, దీనికి కేంద్రమం త్రి కిషన్‌రెడ్డి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్‌లో 36 కిలోమీటర్ల స్కైవేలు నిర్మిస్తే వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని వేగవంతంగా ముందుకు తీసుకుపోయేందుకు రోడ్ల విస్తరణ, నూతన రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, స్టీల్ బ్రిడ్జ్‌ల నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా, విస్తృతంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా, కోవిడ్–19 కట్టడి గురించి కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని, ఇంకా కొన్ని పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కలసిమెలసి అభివృద్ధి చేసుకుందాం: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయాలకతీతంగా కలసిమెలసి అభివృద్ధి చేసుకుందామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. ‘ఇప్పుడు హైదరాబాద్ సిటీ అనగానే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సినిమాహాళ్లకు కేంద్రంగా ఉన్న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు మంచి పేరు ఉంది. ఇది చాలా కీలకమైన ప్రాంతం’అని ఆయన అన్నారు. నగరంలోకి పెట్టుబడులు రావాలంటే ట్రాఫిక్ సమస్య ఉండొద్దని, పెట్టుబడుదారులు ఇప్పుడు బెంగళూరు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య కారణంగా భయపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ అధికారులు, నియోజకవర్గ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘ఎస్పీ నిర్వాకంతో నిలిచిన అభివృద్ధి’
లక్నో: వారణాసిలో ఆలయ అభివృద్ధి, సుందరీకరణ పనులకు సంబంధించి గతంలో ఎస్పీ ప్రభుత్వం సహకరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అప్పటి ఎస్పీ సర్కార్ నిర్వాకంతోనే తన నియోజకవర్గంలో సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు. కాశీ విశ్వనాధ ఆలయ అప్రోచ్ రోడు, సుందరీకరణ ప్రాజెక్టుకు శుక్రవారం ప్రధాని శంకుస్ధాపన చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులకు తొలి మూడేళ్లలో అధికారంలో ఉన్న ఎస్పీ ప్రభుత్వం సహకరించలేదని, యోగి ఆదిత్యానాథ్‌ను మీరు సీఎంగా చేసిన తర్వాతే ఇక్కడ అభివృద్ధి ప్రాజెక్టులు ఊపందుకున్నాయని చెప్పారు. గత ఎస్పీ ప్రభుత్వం సహకరిస్తే ప్రస్తుతం శంకుస్ధాపనకు బదులు ఆయా పనుల ప్రారంభోత్సవం జరిగి ఉండేదని ప్రధాని చెప్పుకొచ్చారు. గత ఏడు దశాబ్దాలుగా ఏ ఒక్క ప్రభుత్వం కాశీ విశ్వేశ్వరుడి గురించి ఆలోచించలేదని, ఆయా ప్రభుత్వాలు తమ ప్రయోజనాల కోసమే పనిచేశి కాశీని విస్మరించాయని విమర్శించారు. కాశీని అభివృద్ధి చేయాలన్నది తన చిరకాల స్వప్నమని, అందుకే తాను ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు పలుసార్లు ఇక్కడికి వచ్చానని, ఇక్కడ అభివృద్ధి జరగాలని కోరుకున్నానన్నారు. కాశీ విశ్వనాధుని ఆశీస్సులతో తన స్వప్నం ఫలించే సమయం ఆసన్నమైందన్నారు. ఆక్రమణలతో కూరుకుపోయిన కాశీ విశ్వనాధ సన్నిధికి ముక్తి కలుగుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆక్రమణలు తొలగించి తాము సమీప భవనాలు స్వాధీనం చేసుకున్న తర్వాత 40 పురాతన దేవాలయాలు వెలుగులోకి వచ్చాయని, వీటిలో చాలా వరకూ ఆక్రమణలకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘డబుల్’ఆశ!
డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై పెరుగుతున్న ఆసక్తి అన్ని వర్గాల వారూ ముందుకు వస్తున్న వైనం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల్లో గురువారం జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల శంకుస్థాపనలు నగర ప్రజల్లో కొత్త ఆశలు రేకె త్తించాయి. మురికివాడల్లోని వారు, పేదలే కాకుండా మధ్య తరగతి ప్రజలు సైతం వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను చూసిన ప్రజలు తమకు కూడా అలాంటి ఇళ్లు కట్టిస్తే బాగుండునని ఆశిస్తున్నారు. ఐడీహెచ్ కాలనీలో ఇళ్లతో పాటు రహదారులు, తాగునీరు, విద్యుత్, వరదనీటి కాలువల వంటి మౌలిక సదుపాయాలన్నీ కలుపుకొని ఒక్కో ఇంటికి రూ.9.23 లక్షల వ్యయమైంది. ఇందులో ఇంటి నిర్మాణ వ్యయం రూ.7.90 లక్షలు. విస్తీర్ణం 580 చ.అ. జీ ప్లస్ టూ పద్ధతిలో నిర్మించారు. తాజాగా గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు జీహెచ్ఎంసీ అధికారులు చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాజేంద్రనగర్, పటాన్చెరు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 160 ఇళ్ల చొప్పున, మహేశ్వరం నియోజకవర్గంలో 80 ఇళ్లకు ప్రతిపాదించారు. మిగతా 20 నియోజకవర్గాల్లో 400 చొప్పున నిర్మించాలని ప్రతిపాదించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న స్థలాలను బట్టి జీప్లస్ 9 , జీ ప్లస్ 3 పద్ధతిలో బహుళ అంతస్తుల్లో నిర్మించాలని యోచిస్తున్నారు. ఒక్కో ఇంటికి నిర్మాణ ఖర్చు రూ.6.81 లక్షలు, మౌలిక సదుపాయాలకు మరో 0.75 లక్షలు... మొత్తం రూ. 7.56 లక్షలు కానుంది. ఒక్కో ఇంటిని 560 చ.అ.ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. వీటిలో లివింగ్ హాల్, మాస్టర్ బెడ్ రూమ్, బెడ్ రూమ్, కిచెన్, రెండు రకాల టాయ్లెట్లు, బాత్రూమ్లు ఉంటాయి. 24 నియోజకవర్గాలకుగాను దాదాపు సగం ప్రాంతాల్లో ఇప్పటికే లాంఛనంగా శంకుస్థాపనలు చేశారు. మిగతా ప్రాంతాల్లో త్వరలో చేయనున్నారు. ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లు చూశాక బహుళ అంతస్తుల ఇళ్లకూ ముందుకొస్తున్నారని... ఓ సంస్థ ప్రతినిధులతో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌తోనూ లబ్ధిదారుల్లో అవగాహన పెరిగి... బహుళ అంతస్తులకు అంగీకరిస్తున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. అఫ్జల్సాగర్లోవాయిదా నాంపల్లి: నగరంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాంపల్లి నియోజకవర్గంలోని మల్లేపల్లి డివిజన్ అఫ్జల్సాగర్లోనూ సాయంత్రం 4 గంటలకు శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించారు. మంత్రి కేటీఆర్ వస్తున్నారని ఉదయం నుంచి వందలాది మంది నిరుపేదలు ఎదురు చూశారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది దగ్గర ఉండి పరిసర ప్రాంతాలు, వీధులను శుభ్రపరిచారు. ఇంతలో సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ అక్కడికి చేరుకున్నారు. మంత్రి రావడం లేదని... అనివార్య కారణాలతో శంకుస్థాపన వాయిదా పడిందని తెలిపారు. దీంతో అఫ్జల్‌సాగర్, మాన్గార్ బస్తీ వాసులు నిరాశతో వెనుదిరిగారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రతిపాదిత స్థలాలు 1. పిల్లిగుడిసెలు, 2.జంగమ్మెట్, 3.గోడేకిఖబర్, 4.కాంగారి నగర్, 5.లంబాడితాండా, 6.ఇందిరానగర్, 7. దోబీఘాట్ (చిలకలగూడ), 8. హమాలీబస్తీ, 9.కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్, 10. సయ్యద్‌సాబ్‌కాబాడా, 11.పార్థివాడ, 12.అంబేద్కర్ నగర్(లంగర్‌హౌస్), 13. మంగాడి బస్తీ, 14. సారథి నగర్, 15.మైలార్‌దేవ్‌పల్లి, 16.చిత్తారం బస్తీ, 17.కేశవ్ నగర్, 18.పటాన్చెరు, 19. భగత్‌సింగ్ నగర్, 20.ఎరుకల నాంచారమ్మ నగర్, 21.సింగంచెరువు, 22.హరిజన బస్తీ (కౌకూరు), 23.కొత్తపేట ఎన్టీఆర్నగర్, 24. బహదూర్‌పురా. -
వైఎస్ జగన్‌ను ప్రశంసించిన డిప్యూటీ సీఎం కేఈ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు రెండేళ్లు పడుతుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాజధాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రాజధాని ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన వారి తరపున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడి మైలేజ్ పొందారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరును కేఈ కృష్ణమూర్తి ప్రశంసించారు. కొన్ని చర్చల్లో వైఎస్ఆర్ సీపీకి మేలు జరిగే అంశాలున్నాయని కేఈ అన్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే బాధ్యత చంద్రబాబుపైనే ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రాయలసీమ మద్దతు ఉంటుందని, తమకు ప్రధానంగా కావల్సింది సాగునీరు అని అన్నారు.