వైఎస్ జగన్ను ప్రశంసించిన డిప్యూటీ సీఎం కేఈ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు రెండేళ్లు పడుతుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాజధాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రాజధాని ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన వారి తరపున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడి మైలేజ్ పొందారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరును కేఈ కృష్ణమూర్తి ప్రశంసించారు. కొన్ని చర్చల్లో వైఎస్ఆర్ సీపీకి మేలు జరిగే అంశాలున్నాయని కేఈ అన్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే బాధ్యత చంద్రబాబుపైనే ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రాయలసీమ మద్దతు ఉంటుందని, తమకు ప్రధానంగా కావల్సింది సాగునీరు అని అన్నారు.