సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కాలేరు
నల్లకుంట: నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో అన్ని డివిజన్‌లలోని బస్తీలు, కాలనీలకు సమాన ప్రాధాన్యతది ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులతో అన్ని డివిజన్‌ల పరిధిలోనూ నూతన సీవరేజీ, డ్రైనేజీ పైప్‌లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.
బుధవారం నల్లకుంట డివిజన్ యాక్సిస్ బ్యాంక్ లేన్‌లో రూ.6 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ అమృతతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా ప్రాంతాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ శ్వేత, వర్క్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్, టీఆర్‌ఎస్ నాయకులు నరేందర్, భాస్కర్ గౌడ్, ప్రవీణ్, సాయికిరణ్, బీజేపీ నాయకులు శ్యామ్‌రాజ్, లక్ష్మణ్‌కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.
రోడ్ల సమగ్రాభివృద్ధికి కృషి..
అంబర్‌పేట: నియోజకవర్గంలో రోడ్ల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. బుధవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్ శ్రీనివాసకాలనీలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిరి్మంచనున్న సీసీ రోడ్లను స్థానిక కార్పొరేటర్ బీ.పద్మావెంకట్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లను సైతం ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ గద్వాల జిల్లా ఇన్‌చార్జ్ బీ.వెంకట్‌రెడ్డి, స్థానిక బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment