సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి ధరల పెరుగుదలలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన కోకాపేటలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ పౌలోమి గ్రూప్ విలాసవంతమైన ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది. గోల్డెన్ మైల్ లేఔట్‌లో, ఔటర్ రింగ్ రోడ్ ఎదురుగా 55 అంతస్తుల్లో పలాజో స్కై స్క్రాపర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.
ప్రస్తుతం ఐదవ అంతస్తు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, దీపావళి సందర్భంగా ఆరో ఫ్లోర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కంపెనీ డైరెక్టర్ ప్రశాంత్ రావు తెలిపారు. పలాజో ప్రాజెక్ట్‌కు ఆసియా పసిఫిక్ ప్రాపర్టీ నుంచి దేశంలోనే బెస్ట్ రెసిడెన్షియల్ హైరైజ్ ఆర్కిటెక్చర్ అవార్డును సొంతం చేసుకుందని పేర్కొన్నారు. 2.3 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో 141 అపార్ట్‌మెంట్లు ఉంటాయని, 6,225 చ.అ. నుంచి 8,100 చ.అ. మధ్య ఉంటాయని చెప్పారు.
ఇదీ చదవండి: పెర్రీ చనిపోయిన ఇల్లు.. రూ.71 కోట్లకు కొన్న భారతీయ మహిళ
2026 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నివాసితులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రతికూల మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ పలాజో ప్రాజెక్ట్‌కు కొనుగోలుదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. ప్రముఖ సంస్థల సీఎక్స్‌ఓలు, వ్యాపారవేత్తలు, వైద్యులు, ఎంటర్‌ప్రెన్యూర్లు కస్టమర్లుగా ఉన్నారని తెలిపారు.
52వ ఫ్లోర్‌లో ఇన్ఫినిటీ పూల్..
70 అడుగుల ఎత్తు గల గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ, డబుల్ హైట్ బాల్కనీ, 52వ అంతస్తులో ఇన్ఫినిటీ పూల్.. ఇవీ పలాజో ప్రాజెక్ట్ వసతుల్లో ప్రత్యేకమైనవి. దీంతో నివాసితులకు సెవెన్ స్టార్ హోటల్ అనుభూతి కలుగుతుంది. ఆకాశమంత ఎత్తులో పూల్ ఉండటంతో కనుచూపు మేర వరకూ సిటీ వ్యూను ఎంజాయ్ చేస్తూ స్విమ్ చేయడం అద్భుతమైన అనుభూతిని పొందొచ్చు. 75 వేల చ.అ.ల్లోని క్లబ్‌హౌస్‌లో స్పా, ప్రైవేట్ డైనింగ్ రూమ్, ఫిట్‌నెస్ సెంటర్, ఫ్యామిలీ ఈవెంట్స్ కోసం బాంక్వెట్ హాల్, బాస్కెట్‌బాల్, స్క్వాష్, బ్యాడ్మింటన్ కోర్టులు వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment