
హైదరాబాద్: కోకాపేటలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. వేగంగా వచ్చిన ఆటో ఓ బైకును ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో బైక్ పై ఉన్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. అయితే పుట్టెడు శోకంలోనూ.. బ్రెయిన్ డెడ్ అయిన ఆ విద్యార్థి అవయవదానానికి అతని తల్లిదండ్రులు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి హైదరాబాద్ కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్ పై వస్తున్నాడు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఆటో ప్రభాస్ ను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే విద్యార్థిని సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు.
కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. బిస్వాల్ ప్రభాస్ అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. లివర్, కిడ్నీలు దానం చేస్తున్నట్టు తెలిపారు. అవయవ దానం చేసిన బిస్వాల్ ప్రభాస్ కు సెల్యూట్ చేస్తూ ఆస్పత్రి సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment