సాక్షి, హైదరాబాద్: కోకాపేట బంగారం కంటే ఖరీదైపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం, నివాసం ఉండటం డెవలపర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. గత ఐదేళ్లలో ప్రాపర్టీ ధరల పెరుగుదలలో దేశంలోనే కోకాపేట రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 89 శాతం మేర పెరుగుదల నమోదు కాగా.. బాచుపల్లిలో 57 శాతం, తెల్లాపూర్‌లో 53 శాతం ధరలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. 2019లో ఈ ప్రాంతంలో ధర చదరపు అడుగుకు రూ.4,750గా ఉండగా.. 2024 నాటికి రూ.9 వేలకు పెరిగింది.
ఈ ప్రాంతంలో భూముల ధరలు ఖరీదు కావడంతో విల్లాల కంటే ఎక్కువగా హైరైజ్ భవనాలనే ఎక్కువగా నిర్మిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకూ కోకాపేట బడ్జెట్ హోమ్స్ దొరికేవి కానీ, ఇప్పుడు 40 అంతస్తుల స్కై స్క్రాపర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనిష్టంగా 8 వేల చదరపు అడుగు నుంచి గరిష్టంగా 16 వేల చదరపు అడుగు విస్తీర్ణం ఉన్న అపార్ట్‌మెంట్లు సైతం నిర్మిస్తున్నారు.
ధర రూ.2.5 కోట్లకు పైమాటే..
గత ఐదేళ్లలో కోకాపేటలో దాదాపు 12,920 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ఇందులో అల్ట్రా లగ్జరీ గృహాలే ఎక్కువగా ఉన్నాయి. రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన యూనిట్ల వాటా 52 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. 30 శాతం మధ్య, ప్రీమియం విభాగం యూనిట్లు, రూ.1.5–2.5 కోట్ల మధ్య ఉన్న లగ్జరీ గృహాల వాటా 19 శాతంగా ఉంది.
బాచుపల్లిలో బూమ్..
బాచుపల్లిలో కూడా రియల్టీ మార్కెట్ బూమ్‌లో ఉంది. ఇక్కడ గత ఐదేళ్లలో ధరలు 57 శాతం పెరిగాయి. 2019లో ఇక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.3,690 ఉండగా.. 2024 నాటికి రూ.5,800లకు పెరిగాయి. మిడ్, ప్రీమియం విభాగానికి బాచుపల్లి కేంద్రంగా మారింది. 2019లో తెల్లాపూర్‌లో ధర చదరపు అడుగుకు రూ.4,819గా ఉండగా.. 2024 నాటికి 53 శాతం వృద్ధి రేటుతో రూ.7,350కు పెరిగాయి. తెల్లాపూర్‌లో గత ఐదేళ్లలో 18,960 యూనిట్లు లాంచింగ్ కాగా.. ఇందులో 66 శాతం ప్రీమియం, 34 శాతం లగ్జరీ విభాగం గృహాలే.
చదవండి: మాట మార్చిన నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..
సంపన్న వర్గాల ఆసక్తి..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలలో రద్దీ పెరగడంతో ఇక్కడి వారు కోకాపేటకు మారుతున్నారు. ఈ ప్రాంతం హై ప్రొఫైల్, ప్రీమియం ప్రాజెక్ట్‌లకు డెస్టినేషన్‌గా మారింది.
– ప్రశాంత్ రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్
మౌలిక వసతులే మెయిన్
ఐటీ కారిడార్లకు చేరువగా ఉండటమే బాచుపల్లి హైలైట్. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్‌తో ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. ప్రవాసులు, ఉన్నత హోదా ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
– నరేంద్ర కుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్
Comments
Please login to add a commentAdd a comment