మధురై (తమిళనాడు): సమాజంలో హిజ్రాల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ కొన్ని సార్లు మానవత్వం ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. ఎంత గౌరవమైన వృత్తిలో పనిచేస్తున్నా ట్రాన్స్‌జెండర్స్ బతుకులు బాగుపడటంలేదు. సరిగ్గా ఇక్కడ కూడా అలానే జరిగింది. పురఘడిగా ఉన్నంత వరకు సాఫీగా ఉన్న జీవితం లింగమార్పిడి చేసుకున్న తరువాత ఆమె జీవితం తలకిందులైంది. ఓ వ్యక్తి మధురైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఓ ఆసుపత్రిలో ఒక సంవత్సరం పాటు వైద్యుడిగా సేవలందించాడు. కొన్ని రోజుల తరువాత మహిళగా మారాలని అనుకున్నాడు. కానీ అటు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇటు సమాజం నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయినా.. లింగమార్పిడి చేసుకున్నాడు.
లింగమార్పిడి తరువాత అతడు కాస్త... ఆమెగా మారింది. అసలు కష్టం ఇక్కడే మొదలైంది. పనిచేస్తున్న ఆసుపత్రిలో ఆమె ఉద్యోగం పోయింది. కుటుంబ సభ్యుల దగ్గరకు వెలితే సరైన ఆదరణ దక్కలేదు. ఉద్యోగంలేక ఆదుకునేవారులేక ఇతర ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి యాచక యాచకవృత్తిని ఎంచుకుంది. అదే ప్రాంతంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కవిత అనే పోలీసు అధికారి ఆమె కష్టాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన యంత్రాంగం ఆమె వివరాలు తెలుసుకున్నారు. నిజంగానే ఆమె డాక్టర్ అని తెలియడంతో క్లినిక్ ఏర్పాటు చేయడానికి ఆమెకు సాయం చేశారు. ఇన్స్పెక్టర్ కవితకు అటు అధికారులు, ఇటు నెటిజన్‌లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. (చదవండి : మొదటి ట్రాన్స్ ఉమన్ డాక్టర్‌గా త్రినేత్ర)
Comments
Please login to add a commentAdd a comment