నటుడు రాజ-తమన్నాల పెళ్లి | Actor Soundararaja Ties Knock With Tamannah | Sakshi
Sakshi News home page

నటుడు రాజ-తమన్నాల పెళ్లి

Published Fri, May 25 2018 9:01 PM | Last Updated on Fri, May 25 2018 9:01 PM

Actor Soundararaja Ties Knock With Tamannah - Sakshi

మధురై: ప్రముఖ తమిళనటుడు సౌందర రాజ ఓ ఇంటివాడయ్యాడు. గ్రీన్‌ యాపిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సీఈవో తమన్నాతో రాజా పెళ్లి శుక్రవారం ఘనంగా జరిగింది. టెంపుల్‌ సిటీ మధురైలో జరిగిన వేడుకకు ఇరు కుటుంబాలు, స్నేహితులు హాజరయ్యారు. సౌందర రాజ.. ‘సుందరపాండియన్‌’, ‘జిగర్‌తాండా’, ‘ఎనక్కు వేరు ఎంగుమ్‌ కిలైగళ్‌ కడియాదు’  తదితర సినిమాల్లోని పాత్రలతో కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును సొంతంచేసుకున్నాడు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువులు ఈ కొత్త జంటను ఆశీర్వదిస్తూ ప్రకటనలు చేశారు. రాజ ప్రస్తుతం ‘కల్లాన్‌’, కాదయ్‌కుట్టి సింగమ్‌’’ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement