సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే? | Siren Movie Director Anthony Bhagyaraj Wedding | Sakshi
Sakshi News home page

Anthony Bhagyaraj: పంతంతో డైరెక్టర్ అయ్యాకే పెళ్లి

May 22 2024 11:25 AM | Updated on May 22 2024 3:16 PM

Siren Movie Director Anthony Bhagyaraj Wedding

మరో డైరెక్టర్ పెళ్లి చేసుకున్నాడు. వివాహ వేడుక చాలా సింపుల్‌గా జరిగిపోయింది. రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్‌గా నిర్వహించాడు. దీనికి పలువురు తమిళ సెలబ్రిటీలు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. అయితే ఈ డైరెక్టర్ పెళ్లి వెనక ఓ స్పెషాలిటీ ఉంది. ఇంతకీ అదేంటంటే?

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

కొన్నాళ్ల క్రితం 'సైరన్' సినిమా రిలీజైంది. జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ మూవీ సరిగా ఆడలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన ఆంథోని భాగ్యరాజ్.. మే 19న రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సోమవారం రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు.

అయితే గత కొన్నేళ్ల నుంచి తమిళ ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. దర్శకుడు అయ్యాకే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు. 'సైరన్' మూవీతో తన కల నెరవేరినందున ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించాడు.

(ఇదీ చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement