siren
-
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు
సమయం అర్థరాత్రి ఒంటి గంట.. నగరం గాఢ నిద్రలోకి జారుకున్న వేళ.. హఠాత్తుగా బ్యాంకు సైరన్ పెద్దగా మోగింది... స్థానికులకు ఉలిక్కిపడి లేచారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు... బ్యాంకులోకి దొంగలెవరో ప్రవేశించారని అనుకున్నారు. అయితే వారు బ్యాంకు దగ్గరకు చేరుకుని అక్కడ జరిగినదేమిటో తెలుసుకుని నవ్వాలో ఏడవాలో తెలియక తెల్లముఖం వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది.హర్డోయ్: ఉత్తరప్రదేశ్‌లోని షాహాబాద్‌లోని హర్దోయ్‌లో రాత్రి ఒంటి గంటకు అకస్మాత్తుగా బ్యాంక్ సైరన్ మోగింది. అప్రమత్తమైన స్థానిక పోలీసులు బ్యాంకు దగ్గరకు చేరుకున్నారు. బ్యాంకు క్యాషియర్‌ను పిలిపించి, లోపల తనిఖీలు చేశారు. గంటల తరబడి వెదికినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఎలుకలు సైరన్ వైరును కొరికినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. అందుకే ఎమర్జెన్సీ సైరన్ మోగిందని తెలుసుకున్నారు. ఊహించిన విధంగా ఏమీ జరగకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చకున్నారు.షహబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్దనున్న ఆర్యవర్ట్ గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో బ్యాంకులోని ఎమర్జెన్సీ అలారం ఒక్కసారిగా మోగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై బ్యాంకు చుట్టుపక్కల దొంగలెవరైనా ఉన్నారేమోనని తనిఖీలు కూడా చేశారు. అయితే ఎలుకల కారణంగా సైరన్ మోగిందని తెలుసుకుని నవ్వుకున్నారు. ఇది కూడా చదవండి: నవ్వుతూ.. నవ్విస్తూ.. -
సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?
మరో డైరెక్టర్ పెళ్లి చేసుకున్నాడు. వివాహ వేడుక చాలా సింపుల్‌గా జరిగిపోయింది. రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్‌గా నిర్వహించాడు. దీనికి పలువురు తమిళ సెలబ్రిటీలు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. అయితే ఈ డైరెక్టర్ పెళ్లి వెనక ఓ స్పెషాలిటీ ఉంది. ఇంతకీ అదేంటంటే?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)కొన్నాళ్ల క్రితం 'సైరన్' సినిమా రిలీజైంది. జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ మూవీ సరిగా ఆడలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన ఆంథోని భాగ్యరాజ్.. మే 19న రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సోమవారం రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు.అయితే గత కొన్నేళ్ల నుంచి తమిళ ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. దర్శకుడు అయ్యాకే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు. 'సైరన్' మూవీతో తన కల నెరవేరినందున ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించాడు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు!) -
OTT Releases: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అయితే ఈసారి కూడాఅరడజనుకుగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కానీ వీటిలో చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలేం లేవు. దీంతో ఆటోమేటిక్ గా అందరి చూపు ఓటీటీలపై పడుతుంది. అందుకు తగ్గట్లే 18 వరకు కొత్త మూవీస్- సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) ఓటీటీ రిలీజుల విషయానికొస్తే.. ఈ వారం సైరన్, ఆర్టికల్ 370, డ్యూన్ పార్ట్ 2 సినిమాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలైతే ఉన్నాయి గానీ వస్తే గానీ వాటి సంగతి తెలియదు. వీకెండ్ వచ్చేసరికి మరికొన్ని సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 15-21 వరకు) నెట్ ఫ్లిక్స్ ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 15 అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17 ద గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ సిరీస్) - ఏప్రిల్ 17 రెబల్ మూన్: పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 19 హాట్ స్టార్ సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17 ద సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17 చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 19 సైరన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఏప్రిల్ 19 జియో సినిమా ద సింపథైజర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15 ఆర్టికల్ 370 (హిందీ మూవీ) - ఏప్రిల్ 19 ఒర్లాండో బ్లూమ్: టూ ద ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19 బుక్ మై షో డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16 లయన్స్ గేట్ ప్లే డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 19 ద టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19 సోనీ లివ్ క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15 జీ5 సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 16 కమ్ చాలు హై (హిందీ సినిమా) - ఏప్రిల్ 19 డిమోన్స్ (హిందీ చిత్రం) - ఏప్రిల్ 19 (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేశ్ మూవీ, స్ట్రీమింగ్ అక్కడే!
తమిళ హీరో జయం రవి, హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరన్. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో మెరిసింది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట్లో నేరుగా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల చేశాకే ఓటీటీలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అక్కడ రిలీజ్ డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను పలు వాయిదాల తర్వాత తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళనాట మరీ అంత పాజిటివ్ స్పందన లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 19 నుంచి హాట్‌స్టార్‌లో సైరన్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కథేంటంటే? ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటించారు. భార్య(అనుపమ పరమేశ్వరన్)ను హత్య చేసిన కేసులో రవి జైలుకెళ్తాడు. పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో ఓ లీడర్‌ను, పోలీస్‌ను హత్య చేస్తాడు. ఈ కేసు కీర్తి సురేశ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను నిజంగానే రవి చంపేశాడా? కీర్తి కేసును ఎలా సాల్వ్ చేసింది? అనేది తెలియాలంటే? ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.. #Siren OTT - Apr 19 - Hotstar. pic.twitter.com/Mr4KPtCHIe — Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2024 చదవండి: అమ్మ అంటే ఎంత ప్రేమో.. తనకోసం ఆలయాన్నే కట్టించిన హీరో -
స్టార్ హీరో యాక్షన్ థ్రిల్లర్.. టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
'తని ఒరువన్' 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ దక్కించుకున్న హీరో జయం రవి. ఆయన తాజాగా 'సైరన్' అనే మాస్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో దసరా భామ కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది. టాలీవుడ్లో ఈ సినిమా 'గంగ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తెలుగు టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ మాట్లాడుతూ.. " ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం. అదీ పెద్ద హీరోతో చేసినప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి తీసుకున్నారు. జీవీ గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. చిత్రం అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని అన్నారు. జయం రవి మాట్లాడుతూ.."ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జీవీ తన సంగీతంతో ప్రాణం పోశారు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కీర్తి సురేశ్ మా నమ్మకాన్ని నిలబెట్టింది. ఆంథోనీ భాగ్యరాజ్ లాంటి కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది హెచ్చరిస్తుంటారు. కానీ ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే విజయం కనిపిస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. మా సైరన్ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, అజయ్, అలగం పెరుమాళ్, పాండ్యన్ కీలక పాత్రలు పోషించారు. -
తాళిబొట్టుతో షాకిచ్చిన హీరోయిన్ అనుపమ.. ఇంతకీ ఏమైంది?
హీరోయిన్లు ఈ మధ్య వరసపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. తెలుగు సినిమాల్లో చేస్తున్న పలువురు ముద్దుగుమ్మలు నిశ్చితార్థం చేసుకుని వివాహానికి రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాళిబొట్టుతో ఉన్న కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు తొలుత షాకయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. అలా రిలాక్స్ అయిపోయారు. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) మలయాళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్ అయ్యింది. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వీటితోపాటు తమిళ, కన్నడ మూవీస్‌లోనూ యాక్ట్ చేసింది. ఒకప్పటితో పోలిస్తే ఈమె చేతిలో పెద్దగా ఛాన్సులైతే లేవు. అలానే గతంలో క్రికెటర్ బూమ్రాతో ప్రేమలో ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ అతడికి పెళ్లయిపోవడంతో ఆ తర్వాత అనుపమ పెళ్లి గురించి ఎలాంటి గాసిప్స్ ఏం రాలేదు. కానీ తాజాగా పెళ్లి చీరతో మెడలో తాళిబొట్టు ఉన్న ఫొటోల్ని అనుపమ.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసేసుకుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది తమిళ సినిమా 'సైరన్'లోని ఓ పాట కోసం రెడీ చేసిన లుక్ అని క్లారిటీ వచ్చేసింది. అంతే తప్ప అనుపమ పెళ్లి ఏం చేసుకోలేదు. కావాలంటే దిగువన ఉన్న ఈ పాట చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న తెలుగు హీరోయిన్) -
రెండు పాత్రల కథ
జయం రవి, కీర్తీ సురేష్ నటించిన చిత్రం ‘సైరన్ ’. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో సుజాత విజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ , థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన చిత్రం ‘సైరన్’. రెండు పాత్రల మధ్య నడిచే కథ ఇది. ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. ఈ మూవీలో తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కొత్తగా కనిపిస్తారు రవి. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. -
బజ్జీల కోసం సైరన్ మోగిస్తూ.. అంబులెన్స్ డ్రైవర్ అత్యుత్సాహం.. షాక్!
సాక్షి, హైదరాబాద్/హిమాయత్‌నగర్: కుయ్ కుయ్ కుయ్ మంటూ సైరన్ మోగిస్తూ వచ్చిన అంబులెన్స్‌ను చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ హుటాహుటిన స్పందించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనానికి దారి ఇచ్చారు.. అంతే.. అంబులెన్స్ సిగ్నల్ దాటాక మిర్చిబజ్జీల దుకాణం ముందు ఆగింది. సెంచురీ ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకమిది. నారాయణగూడ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ మార్గంలో బంజారాహిల్స్ సెంచురీ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ వస్తోంది. ఓల్డ్ సీపీ కార్యాలయం వద్దకు వచ్చేసరికి ట్రాఫిక్ కనిపించడంతో డ్రైవర్ సైరన్ మోగించాడు. దీంతో అక్కడున్న నారాయణగూడ ట్రాఫిక్ పోలీసు రషీద్ హుటాహుటిన ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్రాఫిక్ నుంచి క్షణాల్లో బయటపడ్డ ఆ డ్రైవర్ కాస్త ముందుకెళ్లాక తాపీగా మిర్చి బజ్జీలు తినడం చూసిన కానిస్టేబుల్ బిత్తరపోయారు. అంబులెన్స్‌లో రోగులు లేరని, ఆసుపత్రి సిబ్బంది మాత్రమే ఉన్నారని గ్రహించారు. ఈ ఉదంతం అంతా వీడియో తీసిన కానిస్టేబుల్ దాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన డీజీపీ అంజనీకుమార్.. అంబులెన్స్ సైరన్ల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో సదరు అంబులెన్స్ డ్రైవర్, ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు.. ఇకపై ఇలాంటి దురి్వనియోగాలను సహించబోమని హెచ్చరించారు. ఈ ట్వీట్ చూసిన తర్వాత నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు ఆ అంబులెన్స్‌కు రూ.1000 జరిమానా విధించారు. బుధవారం తనిఖీల కోసం ఆర్టీఏను పంపిస్తున్నట్లు తెలిసింది. డీజీపీ ట్వీట్‌పై సెంచురీ ఆస్పత్రి యాజమాన్యం సైతం స్పందించింది, రోగులు లేకుండా అకారణంగా సైరన్ వేసిన డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. #TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised. Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN — Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023 -
అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే.. మీ ఇష్టమున్నట్టు కాదు..
హైదరాబాద్: రోగులను ఆస్పత్రికి వేగంగా తరలించడానికి అంబులెన్స్ సర్వీస్‌ను ఉపయోగిస్తారు. ఆ సైరన్ వినపడగానే రోడ్డుపై ఆ వాహనానికి దారి ఇస్తాం. ట్రాఫిక్ పోలీసులు సైతం తక్షణ అవసరాన్ని గుర్తించి అంబులెన్స్‌లకు దారి ఇచ్చేలా సిగ్నల్స్‌ను సైతం అందుకు తగ్గట్టుగా మారుస్తుంటారు. కానీ కొందరు ఈ అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేస్తుంటారు. అవసరం లేకున్నా సైరన్ మోగిస్తారు. ఇటీవల ఇలాంటి ఘటనే తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. దీనిపై రాష్ట్ర పోలీసు శాఖ సీరియస్ అయ్యింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్ సైరన్‌ను ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. #TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised. Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN — Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023 ఓ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ ట్రాఫిక్‌లో సైరన్ మోగిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీని గుర్తించిన ట్రాఫిక్ పోలీసు.. సిగ్నల్స్‌ను మార్చి ఆ వాహనానికి తక్షణం దారి ఇచ్చారు. కానీ సిగ్నల్ దాటిన తర్వాత డ్రైవర్ ఆ అంబులెన్స్‌ను ఆపి టిఫిన్ తిన్నట్లు ట్రాఫిక్ పోలీసు గుర్తించారు. రోడ్డు పక్కనే అగి ఉన్న అంబులెన్స్ వద్దకు వచ్చి డ్రైవర్‌ను ప్రశ్నించగా.. నీరసం వస్తుందంటూ పొంతన లేని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పోలీసు యంత్రాంగం.. ఆ అంబులెన్స్ డ్రైవర్ తీరుపై సీరియస్ అయ్యింది. అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఆస్పత్రికి వెళ్లడానికి సైరన్‌ను ఉపయోగించాలని సూచించింది. సమాజ శ్రేయస్సుకు మనమంతా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరింది. ఇదీ చదవండి: చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్‌లో హిజ్రాల రణరంగం -
యుద్ధం.. ఆ శబ్ధం వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది- ఆనంద్ మహీంద్రా
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్రపై ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా స్పందించారు. యుద్ధంతో ముడిపడిన తన చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకుని కలత చెందారు. గత యుద్ధాలు మనకు నేర్పిన పాఠాలు ఏంటీ? ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటూ సూటిగా ప్రశ్నించారు. రష్యా క్షిపణి దాడులకు పాల్పడుతుండటంతో ఉక్రెయిన్ ప్రభుత్వం తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా బాంబు దాడి జరిగే అవకావం ఉన్న సందర్భంలో ముందస్తుగా ఎయిర్ రైడ్ సైరెన్ మోగిస్తోంది. ఈ శబ్ధం విన్న ప్రజలు వెంటనే అప్రమత్తమై బంకర్లలో తల దాచుకుంటున్నారు. రష్యాలోని లివవ్ పట్టణంలో సైరన్ మోగుతున్న వీడియోను ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. I have lived through two wars during my childhood: ‘65 & ‘71. And I remember how spine chilling it was when air raid sirens went off in Mumbai. This sound has reawakened those nightmarish memories. The world doesn’t seem to have learned any lessons… https://t.co/rVxTGy2J80 — anand mahindra (@anandmahindra) February 24, 2022 నా చిన్నతనంలో ముంబై ఉన్నారు. 1965, 1971లో రెండు సార్లు యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో ముంబైపై దాడి జరిగే అవకాశం ఉందంటూ సైరన్లు మోగించారు. అప్పుడు మేమంతా బిక్కచచ్చిపోయి.. బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఇప్పటికీ ఆ సైరన్ వింటే నాకు వెన్నులో వణుకు పుడుతుంది. యుద్ధం తెచ్చే చేటు గురించి తెలిసి కూడా ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడుతారో ? ఇవన్నీ చూస్తుంటే గత యుద్ధాల నుంచి మనమేమీ నేర్చుకోలేదు అన్నట్టుగా ఉంది అంటూ కామెంట్ చేశారు ఆనంద్ మహీంద్రా. -
Ambulance: అక్కడ కుయ్ కుయ్ శబ్ధం బంద్.. ఎందుకంటే..?
ఇంఫాల్: ప్రస్తుతం ఎక్కడ ఉన్నా కుయ్.. కుయ్ అంటూ శబ్ధం చేస్తూ అంబులెన్స్‌లు తెగ తిరుగుతున్నాయి. మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో పెద్ద ఎత్తున ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో అంబులెన్స్‌ల సేవలు పెరిగాయి. రోడ్లపై వాహనాల కంటే వాటి రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రోజంతా కుయ్ కుయ్ అంటూ వెళ్తుండడంతో ఆ శబ్ధం మన చెవులల్లో మార్మోగుతోంది. ఆ శబ్ధం మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. భయాందోళనకర పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే వాటిని శబ్ధం చేయకుండా వెళ్లాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. అంబులెన్స్‌లు చప్పుడు లేకుండా నిశ్శబ్ధంగా రాకపోకలు సాగించాలని మణిపూర్ నిర్ణయం తీసుకుంది. ఆ శబ్ధం వింటే ప్రజలు భయాందోళన చెందుతున్నారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంబులెన్స్‌లు శబ్ధం లేకుండా రాకపోకలు సాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మణిపూర్‌లో కరోనా కొంత తీవ్రంగానే ఉంది. తాజాగా మంగళవారం 624 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. -
మిడతల దండు.. పోలీస్ సైరన్లు!
-
పొలాల వెంట మోగుతోన్న పోలీస్ సైరన్లు
భోపాల్ : కరోనాతో వణికిపోతున్న భారత్‌కు రాకాసి మిడతల దండు కొత్త తలనొప్పిగా మారింది. తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వస్తూ పంటలను స్వాహా చేస్తున్నాయి. మన దేశంలోకి ప్రవేశించిన ఈ దండు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లలో పంటను నమిలేస్తూ అటు రైతులకు, ఇటు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిని పారదోలేందుకు డీజేలు పెడుతూ పెద్ద శబ్ధాలు చేస్తూ పంటను కాపాకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో చెట్లు, పంటలను దాడి చేస్తున్న దండును పారదోలేందుకు పోలీస్ జీపుల సైరన్లను ఉపయోగించారు. (రాష్ట్రంపైకి మిడతల దండు?) పొలాల వెంబడి పోలీస్ జీపులను నడుపుతూ పెద్ద శబ్ధంలో సైరన్లను మోగిస్తూ వాటిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు ఈ విషయం గురించి పన్నాకు చెందిన వ్యవసాయ అధికారి సుమన్ మాట్లాడుతూ.. "మిడతల దండు నుంచి పంటలను కాపాడేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. భారీ శబ్ధాలు లేదా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం ద్వారా రాకాసి దండు బారి నుంచి పంటను కాపాడుకోవచ్చ"ని సలహా ఇచ్చారు. కాగా భారత్‌లో మిడతల దండు ప్రవేశించిన రాష్ట్రాల్లో నివారణా చర్యలు చేపడుతున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. (వణికిస్తున్న రాకాసి మిడతలు: రైతులు గజగజ) -
‘హారన్ల శబ్ధం ఎంతమేర ఉండవచ్చో చెప్పండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ మహానగ రంలో రాజకీయ నేతలు, ప్రముఖులు వినియోగిం చే వాహనాల సైరన్, సౌండ్ హారన్ల వినియోగంపై ఆంక్షలు ఏవిధంగా ఉన్నాయో తెలియజేయాలని తెలంగాణ ప్రభు త్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందిన మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయో, బుగ్గ కార్ల వినియోగ నిబం ధనలు ఏం చెబుతున్నాయో కూడా తమకు వివ రించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సౌండ్ హారన్లు వినియోగించరాదని, ఎర్ర బుగ్గ కార్లను ఎవరు పడితే వారు వినియోగించకుండా ఉత్తర్వులు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారిం చింది. నగరానికి చెందిన న్యాయవాది వినీత్ దన్దా దాఖలు చేసిన పిల్ విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ కల్పించుకుని వివరాలు సేకరించి తెలియజేసేందుకు సమయం కావాలని కోరగా, ధర్మాసనం పైవిధంగా స్పందించింది. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. -
సైరన్ ఎవరు వాడొద్దో చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కార్లపై ఎర్రబుగ్గ, సైరన్‌ను ఏయే హోదాల్లోని వ్యక్తులు ఉపయోగించరాదో చెప్పాలని పిటిషనర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్లపై ఎరుపు, నీలం రంగుల బుగ్గలు, సైరన్ల విని యోగంపై ఆంక్షలు ఉన్నా దర్పం ప్రదర్శించేందుకు కొందరు సైరన్‌ను వినియోగిస్తున్నారని, ఈ విషయంలో కేంద్ర నిబంధనలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన న్యాయవాది భావనప్ప హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వ్యాజ్యంపై విచారణ జరపగా పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎర్రబుగ్గలు, సైరన్ల వినియోగంపై నిషేధం, ఆంక్షలు ఉన్నా, బహిరంగ ప్రదేశాల్లో, టోల్ గేట్ల వద్ద కొందరు సైరన్లను వాడుతున్నారని చెప్పారు. -
వీఐపీ విష సంస్కృతి
అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ఇష్టపడని నేతలు అసంఖ్యాకంగా ఉన్న మన దేశంలో ఉన్నట్టుండి కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘అత్యంత ప్రముఖుల’ వాహనాల నెత్తిన కనబడే ఎర్ర, నీలి రంగు లైట్లకు స్వస్తి పలకాలని తీర్మానించింది. ‘బుగ్గ కార్లు’గా జనం వాడుకలో ఉన్న ఈ బాపతు వాహనాలపై సరిగ్గా నాలుగేళ్లక్రితం సర్వోన్నత న్యాయస్థానం విరుచుకుపడింది. ఇది ‘గణతంత్ర వ్యవస్థ అనుకుంటున్నారా... రాచ రికంలో ఉన్నామనుకుంటున్నారా?’ అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అలా ఆగ్రహిం చారన్న మాటేగానీ బుగ్గకార్లు వాడటానికి అర్హులైనవారి జాబితాను తగ్గించడం తప్ప న్యాయమూర్తులు మరేమీ చేయలేకపోయారు. దీనిపై మరోసారి దృష్టి సారించి కొత్త జాబితాను రూపొందించమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ విషయంలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటామంటూ తమ వాహనాలకున్న ఎర్రబుగ్గలను తొలగింపజేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వీఐపీ జాబితాకు అంటకత్తెరేయడం కాక ఏకంగా ఆ జాబితానే రద్దు చేశారు. రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి మొదలుకొని అందరూ వచ్చే నెల 1 నుంచి బుగ్గకార్లు వినియోగించరు. ఈ పని చేసినందుకు మోదీని అభినందించాలి. మన దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల అంతో ఇంతో స్తోమత ఉన్నవారు సొంతానికి వాహనాలు సమకూర్చుకొనక తప్పని స్థితి ఏర్పడింది. అందువల్లే పల్లెటూరు, పట్నం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా రోడ్లపై వాహనాలు పెరిగిపోయాయి. నగరాలైతే మరింత కిక్కిరిసిపోతున్నాయి. ఇవి చాలవన్నట్టు బుగ్గకార్ల బెడద ఒక వైపరీత్యంలా మారిపోయింది. కార్పొరేటర్లు మొదలుకొని సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, ఐఏఎస్‌లు, కార్పొరేషన్ చైర్మన్లు... ఒకరేమిటి ఎందరెందరో ఈ బుగ్గ కార్లతో సాధారణ ప్రజాజీవనానికి పెను అంతరాయం కలిగిస్తున్నారు. ఈ వీఐపీల జాబితా రోజులు గడుస్తున్నకొద్దీ పెరిగిపోతోంది. 2002లో ఇలాంటి వాహనాల విని యోగంపై కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. మరో మూడేళ్లకే దాన్ని మరింత పెంచుతూ సవరించారు. అందులో రాష్ట్రపతి మొదలుకొని కేంద్ర ఉప మంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులు, కేబినెట్ కార్యదర్శి, త్రివిధ దళాధిపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వివిధ కమిషన్ చైర్మన్లు ఇతరులు ఉన్నారు. ఈ కార్లలో వేరేవారు ప్రయాణిస్తున్న సందర్భాలుంటే పైనున్న లైట్లను నల్ల కవర్‌తో కప్పి ఉంచాలని అందులో సూచించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలు దీనికి అదనం. ఏతావాతా దేశంలో ఇప్పుడు 5,96,000మంది వీఐపీలు తయారయ్యారని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ‘అసలు’ ఎంత...‘నకిలీ’ ఎంత అన్న విచికిత్సకు ఆస్కారమే లేదు. ఎవరికైనా అనుమానం వచ్చి ఫిర్యాదు చేస్తే, పోలీ సులు ఆపితే అప్పటికప్పుడు ఎవరిచేతనో ఫోన్ చేయించుకుని బయటపడటం ఎలాగో ఈ ‘వీఐపీ’లకు తెలుసు. నిజంగా ప్రాణాలకు ముప్పున్నవారికి, పదవుల రీత్యా రక్షణ అవసరమున్న వారికి ఎంతో కొంత భద్రత కల్పిస్తే ఎవరూ తప్పు బట్టరు. అభ్యంతరమల్లా ఈ పేరిట సాగుతున్న వేలంవెర్రితోనే. ఫ్యూడల్ వ్యవస్థకూ, వలస పాలనకూ ప్రతీక అయిన ఈ వీఐపీ సంస్కృతి విరగడ కావాలని ఆశించనివారుండరు. కనుక కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. అయితే మొత్తంగా దేశంలో తిష్టవేసిన వీఐపీ సంస్కృతికి బుగ్గకార్లు ప్రతీకే తప్ప అందులోనే సర్వస్వమూ ఇమిడి లేదు. దేశంలో ఉగ్ర వాదుల, తీవ్రవాదుల బెడద పెరిగినప్పటినుంచీ ఎక్కువగా వాడుకలోకొచ్చిన వీఐపీ భద్రత కూడా ఈ బాపతే. సాధారణ కానిస్టేబుళ్ల రక్షణ మొదలుకొని కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం(సీఆర్పీఎఫ్), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) వరకూ ఎన్నో రకాల భద్రతలు అమలుకావడం మొదలైంది. ఇందులో మళ్లీ ఎక్స్, వై, జడ్, జడ్ ప్లస్ లంటూ ఎన్నో రకాలున్నాయి. ‘ఎక్స్’ నుంచి ‘జడ్’, ‘జడ్‌ప్లస్’ల దగ్గరకొచ్చేసరికి రక్షణ కల్పించే సాయుధుల జాబితా పాపం పెరిగినట్టు పెరుగుతూ పోతుంది. ‘ఎక్స్’ రకానికి ఇద్దరు భద్రతా సిబ్బంది ఉంటే ‘జడ్ ప్లస్’కొచ్చేసరికి ఆ సంఖ్య 36కు చేరుతుంది. నాలుగు వేలమందికి మించని ఎస్పీజీకి ఏటా అయ్యే వ్యయం రూ. 360 కోట్లని ఒక అంచనా. సర్కారు ఖజానా వీఐపీల సేవలో తరిస్తున్నదన్నమాట! ఎన్నికల ప్రచా రాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లడిగేవారు అధికారం చేతికందగానే భద్రతా వలయాల్లో ముడుచుకుపోయి హడావుడి చేయడం హోదాకూ, దర్పానికీ ప్రతీకగా మారింది. ట్రాఫిక్‌ను ఎక్కడైనా, ఎంతసేపైనా ఆపిస్తూ పోవడం తమ జన్మహక్కుగా వారు భావిస్తారు. రోడ్లపైన మాత్రమే కాదు... వారు గుళ్లూ గోపురాల సందర్శనకెళ్లినా సర్వం స్తంభించిపోతుంది. వృద్ధులున్నారని, పిల్లలున్నారని తమ కారణంగా వారంతా ఇబ్బంది పడతారని ఈ వీఐపీలకు తోచదు. ఆలయాల్లో మాత్రమే కాదు... టోల్‌ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వగైరాలన్నీ ఈ వీఐపీల బలప్రదర్శనా కేంద్రాలే. ఆమధ్య కేంద్ర హోంశాఖ సహాయమంత్రి రిజుజు తనవారి కోసం విమానాన్ని చాలాసేపు ఆపించారని వార్తలొచ్చాయి. తనకు అడిగిన సీటు కేటాయించలేదని మొన్నటికి మొన్న ఒక సీనియర్ అధికారిని బూటుతో 25 సార్లు కొట్టిన శివసేన ఎంపీని అందరూ చూశారు. ఆ వివాదం ఒక కొలిక్కి రాకముందే తృణమూల్ మహిళా ఎంపీకి కోపమొచ్చి 40 నిమిషాలు విమానాన్ని కదలనివ్వలేదు. యూపీలో టోల్‌ప్లాజా దగ్గర ఒక బీజేపీ ఎమ్మెల్యే అక్కడి సిబ్బందిని చావబాదాడు. నిజానికి సమస్య వీఐపీలతో మాత్రమే కాదు... వారి సంతానం, వారి అనుచరగణం సైతం ఈ ముసుగులో ఎక్కడికెళ్తే అక్కడ అరాచకం సృష్టిస్తారు. టీడీపీ ఏలుబడిలోని ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు సంబంధించి బోలెడు ఉదాహరణలు కనబడుతుంటాయి. ఈ సంస్కృతి దుంపనాశనమైతే తప్ప మన ప్రజాస్వామ్యానికి అర్ధం ఉండదు. ఇప్పుడు బుగ్గకార్లు నిషేధించి పుణ్యం కట్టుకున్న ఎన్డీఏ సర్కారు మొత్తంగా ఈ సంస్కృతిపై గురిపెట్టి తన చిత్తశుద్ధి చాటుకోవాలి. -
'ఎర్ర బుగ్గ’లకు సెలవ్!
-
‘బుగ్గ’లకు సెలవ్!
వీవీఐపీల కార్లకు సైరన్లూ ఉండవు ∙కేంద్ర కేబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ: వీవీఐపీ సంస్కృతిని పక్కనపెడుతూ.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతరుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. మే 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ నిశ్చయించింది. అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలతోపాటుగా ఇతర అత్యవసర సహాయ వాహనాలకు మాత్రమే ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. ‘వీఐపీ సంస్కృతిని సూచించే అన్ని రంగుల బుగ్గలను తొలగించాలనుకుంటున్నాం.. ఇలాంటి వాటికి ప్రజాస్వామ్య దేశంలో స్థానం లేదు’ అని ప్రభుత్వం తెలిపింది. భేటీ వివరాలను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. ‘మే 1 తర్వాత ఎవరి వాహనాలపైనా బుగ్గలుండకూడదు. కేవలం అత్యవసర వాహనాలపైనే నీలి బుగ్గలుంటాయి. కేంద్రం గానీ, రాష్ట్రాలు గానీ ఎవరికీ ఇలాంటి బుగ్గలను వాహనాలపై పెట్టుకునేందుకు అనుమతిచ్చే అధికారం ఉండదు. దీనికెవరూ మినహాయింపు కాదు. ఎందుకంటే బుగ్గలకు సంబంధించిన నిబంధనలనే చట్టం నుంచి తొలగిస్తున్నాం’ అని జైట్లీ తెలిపారు. చాలాకాలంగా దీనిపై చర్చ జరుగుతోం దన్న కేంద్ర మంత్రి.. దీనికి అనుగుణంగా కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనల్లో సవరణలు చేస్తామన్నారు. ఇప్పటికే వీఐపీ వాహనాలకు బుగ్గలు, సైరన్లు లేని విధానాన్ని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువల బలోపేతానికే.. ‘ప్రజల ప్రభుత్వం.. వీఐపీ సంస్కృతిలో భాగమైన వాహనాలపై బుగ్గలు, సైరన్లను తొలగించాలని నిర్ణయించింది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య విలువలను ఇది మరింత బలోపేతం చేస్తుంది. వీటిని తొలగించాలంటూ వస్తున్న వినతులను గౌరవిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంది’ అని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎర్రబుగ్గ, సైరన్లను తొలగించి కేబినెట్ భేటీ నిర్ణయాన్ని అమలుచేసిన తొలి మంత్రిగా నితిన్ గడ్కరీ నిలిచారు. మంత్రులు తమ వాహనాలకు సైరన్లు వినియోగించటం సరికాదని.. కేవలం పైలట్ పోలీసు వాహనాలకు మాత్రమే సైరన్లుండాలని మంత్రి తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపర చర్యలు తప్పవన్నారు. ఈ దిశగా వాహన చట్టానికి చేయాల్సిన సవరణలపై ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్‌కు నిధులు: ఎన్నికల వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావటంలో భాగంగా.. పేపర్ ట్రయల్ మెషీన్స్‌ను వినియోగించాలన్న ఈసీ ప్రణాళికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్లకు అవసరమైన 16,15,000 వీవీపీఏటీ (ఓటు నిర్ధారణ పత్రం) యంత్రాల కోసం రూ. రూ.3,174 కోట్లు ఖర్చుకానుంది. బుధవారం దీనిపై చర్చించిన కేంద్ర కేబినెట్.. తొలి దశలో రూ. 1600 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఏడాది మిగిలిన మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. ఒక్కో యంత్రం తయారీకి రూ. 19,650 ఖర్చు అవుతుందని అంచనా. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈసీ నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇతర కేబినెట్ నిర్ణయాలు: వ్యాపారుల వద్ద చక్కెర నిల్వల పరిమితిని మరో ఆరునెలలు (ఏప్రిల్ 29 నుంచి అక్టోబర్ 28, 2017 వరకు) పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. 1991–1999 మధ్య చనిపోయిన లేదా గాయపడిన సైనికులు మూడు నెలలపాటు సెలవులను ఎన్‌క్యాష్‌మెంట్ (డబ్బులు పొందటం) చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. ప్రతి భారతీయుడూ వీఐపీనే: మోదీ ‘ప్రతి భారతీయుడూ ప్రత్యేకమే. ప్రతి ఒక్కరూ వీఐపీనే. చాలా కాలం క్రితమే ఈ బుగ్గల తొలగింపు జరగాల్సింది. నేడు గొప్ప ప్రారంభం జరిగింది. నవభారతం స్ఫూర్తిలో ఇవన్నీ సరైనవి కావు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు. కాగా, కేంద్ర కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో తన వాహనంపై ఎర్రబుగ్గను తక్షణమే తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ స్పష్టం చేశారు. గుజరాత్‌లోనూ వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడినట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ తెలిపారు. త్వరలోనే గుజరాత్ అంతటా దీన్ని అమలుచేస్తామన్నారు. గోవా సీఎం మనోహర్ పరీకర్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా తక్షణమే ఎర్రబుగ్గను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రాలకు నేరుగా విదేశీ రుణం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన నిధులకోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ) లాంటి విదేశీ రుణ సంస్థల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రాలు తమ ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) లక్ష్యాలను చేరుకునేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుకోసం ఓడీఏ(అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్) భాగస్వాముల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు వీలు కల్పించే మార్గదర్శకాలకు ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ రుణ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నేరుగా అప్పు తీసుకునేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడతాయి. అయితే, కేంద్రం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. -
స్వైన్ ఫ్లూ సైరన్!
అనంతపురం : జిల్లాలోనూ స్వైన్ ఫ్లూ సైరన్ మోగింది. మూడు నెలల క్రితమే ఇద్దరు మృత్యువాత పడ్డారు. అయితే.. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గోప్యంగా ఉంచుతూ వచ్చారు. కేసు లు వెలుగులోకి వచ్చాకైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా అంటే అదీ లేదు. తీరా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తుంటే హడావుడి చేయడానికి జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. -
ఆవేదన నుంచి పుట్టిన ఆవిష్కరణ
• సెలైన్ అరుుపోగానే సైరన్ • జాతీయ ఇన్‌స్పైర్‌కు ఎంపిక • విద్యార్థి, ఉపాధ్యాయురాలి మేధోశ్రమకు ప్రశంసలు గోవిందరావుపేట: ఓ విద్యార్థి.. మరో ఉపాధ్యాయురాలి ఆవేదన నూతన ఆవిష్కరణకు శ్రీకారం చూట్టింది. రోగికి సెలైన్ ఎక్కించే సమయంలో అది ఎప్పుడు అరుుపో తుందోనని ఎదురు చూడకుండా.. సైరన్ మోగేలా చేసిన వీరి ఆవిష్కరణ జాతీయస్థారుు ఇన్‌స్పైర్‌కు ఎంపికైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండ లం పస్రా గ్రామానికి చెందిన బొజ్జ ప్రభు లత(14) గోవిందరావుపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువు తోంది. తల్లి అనారోగ్యం బారిన పడిన సమ యంలో సెలైన్ ఎక్కించినప్పుడు అది ఎప్పుడు అరుుపోతుందా అని ఎదురు చూసేది. ఇదే పరిస్థితిని పాఠశాల ఉపాధ్యాయురాలు కొము ర పాలెం జ్యోతి తన సోదరుడి అనారోగ్యం సందర్భంగా ఎదుర్కొంది. ఇరువురూ సెలైన్ అరుుపోగానే సిగ్నల్ వచ్చేలా చేస్తే బాగుం టుందని ఆలోచించి, ఈ మేరకు అలాంటి పరికరం ఆవిష్కరణకు పూనుకున్నారు. పలువురి ప్రశంసలు వీరి ప్రదర్శనను తిలకించిన ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ సురేష్‌బాబు, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిధి రజని, డీఆర్డీవో శాస్త్రవేత్త కరుణానిధి, పలువురు ఉస్మానియా ప్రొఫెసర్లు నూతన ఆవిష్కరణను అభినందించారు. జిల్లా ఇన్‌స్పైర్‌లో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ , ఎన్ఐటీ వరంగల్‌లో నిర్వహించిన టెక్నోజి యాన్, హైదరాబాద్‌లో ఎగ్జిబిట్‌ను ప్రదర్శిం చి అన్ని చోట్లా పలువురి ప్రశంసలు పొందారు. తాజాగా జాతీయ ఇన్స్పైర్ పోటీలలో డిసెంబర్ 10, 11 తేదీల్లో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. జాతీయ స్థారుుకి వెళతాననుకోలేదు.. తమ ఉపాధ్యాయురాలితో కలిసి తయారు చేసిన ఎగ్జిబిట్ జాతీయ స్థారుుకి వెళుతుందని ఊహించలేదని ప్రభులత పేర్కొంది. రోగులకు సేవలందించే క్రమంలో వారి బంధు వులు, నర్సింగ్ స్టాఫ్‌కు ఉపయోగకరంగా ఉండేలా మంచి ఆలోచనకు సహకరించడం ఎంతో సంతృప్తినిస్తోందని జ్యోతి ఆనందం వ్యక్తం చేసింది. ఎలా పనిచేస్తుందంటే.. డ్రిప్ మానిటర్‌ను చిన్న తూకం వేసే స్ప్రింగ్, 9 ఓల్టుల బ్యాటరీ, బజర్, ఎల్ఈడీ, స్విచ్, స్టాండ్, సెలైన్ వంటి పరికరాలతో రూ.300లోపు ఖర్చుతో తయారు చేశారు. స్ప్రింగ్ పరికరానికి అమర్చిన వైర్ల ద్వారా బ్యాటరీ, బజర్‌కు అనుసంధానం చేశారు. స్ప్రింగ్‌కు సెలైన్‌ను పెట్టడం ద్వారా బాటిల్లో ద్రవం తగ్గిన కొద్దీ స్ప్రింగ్ దగ్గరకు వచ్చి 50 ఎంఎల్ ఉండగానే బజర్ మోగు తుంది. దీనిని ఆస్పత్రిలో పేషెంట్ వద్ద కాకుండా వైర్ అమర్చి దూరంగా నర్స్ లుండే ప్రాంతంలో ఉంచేలా ఆధునీ క రించి రాష్ట్రస్థారుు ప్రదర్శనలో ఉం చారు. బజర్ మోగగానే నర్సులు ఆ బెడ్ వద్దకు వెళ్లి సేవలందించే వీలు కలుగుతుంది. -
సెల్యూట్లు... సైరన్లే మిగిలాయి
అధికార టీఆర్ఎస్ నేతల పరిస్థితి కక్కలేక... మింగలేక అన్నట్లు తయారైంది. నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూసీ చూసీ విసిగిపోయిన వీరు నాయకత్వం తీరుపై జోకులు వేసుకుంటున్నారు. ఒకట్రెండు కార్పొరేషన్లు, శుక్రవారం ఓ పది మార్కెట్ కమిటీలకు చైర్మన్లు మినహా నామినేటెడ్ పదవుల పందేరం జరగలేదు. ఒక విధంగా ఇది వారి కడుపు మంటే అయినా, బహిరంగంగా మాత్రం వ్యాఖ్యానించలేకపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గడిచిన పదిహేనేళ్లుగా కొనసాగుతున్న వారిలో చాలా మందికి ఇంకా ఎలాంటి పదవీ యోగం పట్టలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా... రాజకీయ నిరుద్యోగంతో ఉడికిపోతున్న కొందరు నాయకులు తమకి తాము సర్ది చెప్పుకుంటున్నారు. మరోవైపు ఏ చిన్న పనికూడా కావడం లేదని, తమ వద్దకు పనుల కోసం వచ్చే కార్యకర్తలకు ఏం చెప్పాలో పాలుపోవడం లేదంటూ వాపోతున్నారు. చివరకు ఎమ్మెల్యేలు, మంత్రులకే ఏమీ నడవడం లేదట కదా అని సెటైర్లు పేలుస్తున్నారు. ‘మా నాయకునికి ఇష్టమున్నట్టులేదు. ఉంటే గింటే ఈ పాటికే మాకు పదవులు రాకపోవునా.. అయినా ఆశగా ఎదురుచూడడం తప్ప ఇప్పుడేం చేయలేం. టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్లు మాత్రం ఏమన్నా సంతోషంగా ఉన్నారా..? మంత్రులు కూడా మాకు ఏం చేయలేకపోతున్నారు. అయినా... వారికి కూడా సెల్యూట్లు.. సైరన్లే మిగిలాయి..’ అని ఓ నేత వ్యాఖ్యానించారు. పార్టీ నేతల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి గురించి ఎవరూ ఆలోచించడం లేదని పదవులు రాని నేతలంతా గొణుక్కుంటున్నారు..!! -
బ్యాంకు దోపిడీకి యత్నం
- కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోనికి ప్రవేశించిన దుండగులు - స్ట్రాంగ్‌రూం తాళాలు తెరుస్తుండగా మోగిన సైరన్ - సీసీ కెమెరా, డీవీడీ, మోడెమ్తీసుకుని పరార్ పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకులో దోపిడీ చేసేందుకు ఓ ముఠా శుక్రవారం అర్ధరాత్రి యత్నించింది. లోనికి ప్రవేశించాక స్ట్రాంగ్‌రూమ్ తాళాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా సైరన్ మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అంతకుముందు ఇదే గ్రామంలోని ఓ పారిశ్రామికవేత్త ఇంటి వద్ద కూడా వీరు చోరీకి ప్రయత్నించినట్టు తెలిసింది. మొత్తం మీద ఆరితేరిన దొంగలే ఈ దోపిడిలో పాల్గొని ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలమాసనపల్లె గ్రామం లో జనావాసాలకు దూరంగా గ్రామీణ బ్యాంకు ఉంది. గతంలో ఎప్పుడూ ఇక్కడ చోరీలు జరిగిన సందర్భాలు లేవు. కానీ బ్యాంకులో సీసీ కెమెరాలు, అలారం ఏర్పాటు చేశారు. ఈ ధైర్యంతో అక్కడ వాచ్‌మన్‌ను పెట్టడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చూపారు. ఇదే దొంగలకు అనుకూలంగా మారింది. శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో దొంగల ముఠా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. బ్యాంకు కిటికీని తెరచి అందులోని రెండు ఇనుప గ్రిల్స్‌ను ఆక్సాబ్లేడ్, లేదా ఎలక్ట్రానిక్ కటింగ్ మెషీన్ సాయంతో కట్ చేశారు. కట్ చేస్తున్నప్పుడు శబ్దం రాకుండా ఉండేందుకు నీరు పోస్తూ గ్రిల్స్ తొలగించారు. ఆ కిటికీ గుండా లోనికి ప్రవేశించి తొలుత సీసీ కెమెరా వైర్లను తొలగించారు. అయితే సైరన్‌కు సంబంధించిన వైర్లు కనిపించపోవడంతో వాటిని కత్తిరించడం మరిచారు. బ్యాంకులోని అన్ని డ్రాలను ఓపెన్‌చేసి స్ట్రాంగ్‌రూమ్ తాళాలకోసం వెతికారు. ఎక్కడా లేకపోవడంతో స్ట్రాంగ్‌రూమ్ తాళాలను తీసేందుకు స్క్రూడ్రైవర్ ద్వారా ప్రయత్నించారు. దీంతో సైరన్ మోగడం ప్రారంభించింది. వెంటనే దొంగలు కిటికీ గుండా బయటికి వెళ్లి పక్కనే ఉన్న వాహనంలో పరారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చేయితిరిగిన ముఠాపనేనా! దోపిడీకి యత్నించిన తీరును బట్టి చూస్తే ఈ ముఠాలో కనీసం నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు బ్యాంకులోకి వెళ్లిన తీరు, లోన సీసీ కెమెరాల వెర్లను తొలగించడం, వీడియో ఫుటేజీ కనిపించకుండా మోడెమ్‌ను తీసుకెళ్లడాన్ని బట్టి చూస్తే ఇది చేయితిరిగిన ముఠా పనేనని తెలుస్తోంది. వీరుముందే ఇక్కడ రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. బ్యాంకు వద్దకు వెళ్లకముందే వీరు గ్రామ సమీపంలోని ఓ మహిళా పారిశ్రామిక వేత్త ఇంటి తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ వాచ్‌మన్ ఉండడంతో వారి ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు అర్థమవుతోంది. బ్యాంకులో అలారం మోగినపుడు సరిగ్గా సమయం 12.48గా నమోదై ఉంది. అంటే వీరు అర్ధరాత్రి 12నుంచే ఈ దోపిడీకి యత్నించినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనతో కొలమాసనపల్లె గ్రామం ఉలిక్కిపడింది. సంఘటన స్థలాన్నిసందర్శించిన నిపుణులు.. బ్యాంకు వద్ద అలారం మోగిన కాసేపటికే కొందరు స్థానికులు జరిగిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. మరోవైపు పలమనేరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శనివారం ఉదయం గంగవరం సీఐ రవికుమార్, డీఎస్పీ శంకర్ బ్యాంకును సందర్శించారు. అనంతరం చిత్తూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌లు ఇక్కడికి చేరుకున్నాయి. పోలీసుజాగిలాలు బ్యాంకు నుంచి పలమనేరు రోడ్డు మీదుగా గొల్లపల్లె వరకు వెళ్లిఆగాయి. ఇప్పటికే ఈ కేసును ఛేదిం చేందుకు సర్కిల్ ఐడీ పార్టీ రంగంలోకి దిగిం ది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పలమనేరు ఇన్చార్జ్ సీఐ రవికుమార్ తెలిపారు.