![Jayam Ravi, Keerthy Suresh Siren Movie OTT Release Date Out - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/10/Siren-Movie-OTT-Release-Date-Out.jpg.webp?itok=N8JQaFUa)
తమిళ హీరో జయం రవి, హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరన్. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో మెరిసింది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట్లో నేరుగా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో థియేటర్‌లో విడుదల చేశాకే ఓటీటీలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది.
అక్కడ రిలీజ్
డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను పలు వాయిదాల తర్వాత తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళనాట మరీ అంత పాజిటివ్ స్పందన లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 19 నుంచి హాట్‌స్టార్‌లో సైరన్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు.
కథేంటంటే?
ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటించారు. భార్య(అనుపమ పరమేశ్వరన్)ను హత్య చేసిన కేసులో రవి జైలుకెళ్తాడు. పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో ఓ లీడర్‌ను, పోలీస్‌ను హత్య చేస్తాడు. ఈ కేసు కీర్తి సురేశ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను నిజంగానే రవి చంపేశాడా? కీర్తి కేసును ఎలా సాల్వ్ చేసింది? అనేది తెలియాలంటే? ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి..
#Siren OTT - Apr 19 - Hotstar. pic.twitter.com/Mr4KPtCHIe
— Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2024
చదవండి: అమ్మ అంటే ఎంత ప్రేమో.. తనకోసం ఆలయాన్నే కట్టించిన హీరో
Comments
Please login to add a commentAdd a comment